మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు షురూ అయ్యాయి.  ఈనెల 21 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  అన్ని పార్టీలు ప్రచారం నిర్వహిచేందుకు సిద్ధం అవుతున్నాయి.   గెలవాలని పార్టీలు భావిస్తున్నాయి.  ముఖ్యంగా బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది.  రెండు  రాష్ట్రాల్లో  ఎక్కడా కూడా అవినీతి లేదు.  అవినీతి లేదు అంటే ప్రభుత్వం చక్కగా పనిచేస్తోంది.  


అంతేకాదు, జాతీయ భద్రతా విధానంలో బీజేపీ కఠినంగా వ్యవహరిస్తోంది.  కాబట్టి ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు.  ఇదే సమయంలో దేశంలో ఇండియా పౌరులు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి ఎన్ఆర్సి ప్రయోగించేందుకు సిద్ధం అవుతున్నది.  దేశవ్యాప్తంగా ఎన్ఆర్సి ని ప్రయోగిస్తే.. ఇండియా పౌరులు ఎంతమందో.. విదేశాల నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చి నివసిస్తున్న వ్యక్తులు ఎవరో స్పష్టంగా తేలిపోతుంది.  


ఫలితంగా ఇండియాను సురక్షితంగా ఉంచుకోవడానికి వీలౌతుంది. జాతీయ స్కీంలు సైతం ప్రచారంలో ప్రాముఖ్యతను సంతరించుకోబోతున్నాయి.  ఇలా వీటిని ప్రచారంలో వినియోగించేందుకు బీజేపీ సిద్ధం అయ్యింది.  అంతేకాదు, బీజేపీ తరుపున ప్రధానిమోడీ , అమిత్ షాలు ప్రచారం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. మహారాష్ట్రలో ప్రధాని 10, హర్యానాలో 5 ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు..  


ఇక అమిత్ షా రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేయబోతున్నారు.  ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి కీలకమైనవి.  మహారాష్ట్రలో బీజేపీ.. శివసేన పొత్తు ఉన్నది కాబట్టి తప్పకుండా 288 స్థానాలకు గాను 220 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  అలానే హర్యానాలో 90 స్థానాలకు గాను 75 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది బీజేపీ. ఈ దిశగానే ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  మరి ఓటర్ల మనసులో ఏమున్నది.. ఎవరికి ఓటు వేయబోతున్నారు అన్నది తెలియాలి. అక్టోబర్ 24 వ తేదీన ఫలితాలు వెలువడతాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: