తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడవరోజు కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఇక్కట్లు అన్ని ఇన్ని కావు . సరైన బస్సుల సౌకర్యం లేక ఆగమాగం అవుతున్నారు ప్రయాణికులు. కాగా  దసరా పండక్కి ఊళ్లకు వెళ్లే వాళ్ళ పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. దసరా పండుగ వేల  ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టి మూడు రోజులు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం  ఇప్పటివరకు సరైన నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో దసరా సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిర్వహించడంతో... ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు పెంచి ప్రయాణికుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ఇష్టా  రీతిన ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు.

 

 

 

 

 

 

 ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అద్దె  ప్రైవేటు బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడుపుతామని... సాధారణ ఛార్జీలు వసూలు చేస్తూ  ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చుతామని ప్రభుత్వం చెప్పింది. కానీ రాష్ట్రంలో పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నది ఒకటి  చేస్తున్నది ఒకటి అనే విధంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏమో సాధారణ చార్జీలు వసూలు చేసి ప్రభుత్వం తిప్పుతున్న బస్సులో ప్రయాణం చేయవచ్చని చెబుతున్నప్పటికీ... వాస్తవంగా జరుగుతున్న దానికి ఏ మాత్రం సంబంధం కనిపించడం లేదు. బస్సు ఎక్కితే చాలు బలవంతపు దోపిడి అమలవుతుంది.

 

 

 

 

 జస్ట్ రెండు కిలోమీటర్లు ప్రయాణించిన 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు తీసుకుంటున్నారు తాత్కాలిక కండక్టర్లు. ఇదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే మాకు డిపో మేనేజర్లు  ఇలాగే తీసుకోమని చెప్పారు అంటూ సమాధానం ఇస్తున్నారు. ఇంకొంచెం దూరం పెరిగింది అంతే  యాభై నుంచి వంద రూపాయల వరకు తీసుకుంటున్నారు. దసరా పండక్కి దూరంగా ఉన్న ఊళ్లకు వెళ్లే వాళ్ల పరిస్థితి అయితే జేబులు గుల్ల  అవ్వాల్సిందే. ప్రైవేటు బస్సులకు దీటుగా ఎక్కడ తగ్గకుండా చార్జీలు వసూలు చేస్తున్నారు. 200 కిలోమీటర్ల దూరానికి 500 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక బస్పాస్ లో ఉన్న వాళ్లకి కూడా చార్జీలు తప్పట్లేదు. దీంతో ప్రయాణికులు అందరూ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి  చేస్తున్నది ఒకటి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: