ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.  పైగా సమ్మె చేస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.  ఏకకాలంలో 50 వేలమంది ఉద్యోగులకు తొలగించడం అంటే మాములు విషయం కాదు.  చరిత్రలో ఇప్పటి వరకు అలా జరగలేదు.  


ఇకపై ఆర్టీసీ కార్మికులతో సంబంధాలు లేవని, వారితో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.  కార్మిక సంఘాలు మాత్రం భయపడం లేదని, గతంలో ఇలాంటివి చాలా చూశామని అంటున్నారు.  సకలజన సమ్మె సమయంలో తమ పాత్ర ఎలాంటిదో అందరికి తెలుసునని అన్నారు.  డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె చేసి తీరుతామని అంటున్నారు.  ప్రభుత్వం వారిని ఉద్యోగులుగా పరిగణింపబడనపుడు సమ్మెకు అనుమతి ఎలా ఇస్తుంది.  


ఇక,ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వివిధ పార్టీలనుంచి మద్దతు వస్తున్నది.  అన్ని పార్టీలు ఈ సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. కార్మికుల పక్షపాతిగా ఉండే లెఫ్ట్ పార్టీలు సైతం మద్దతు పలికాయి.  అయితే, ఇక్కడ ఓ విషయం తెలియాల్సి ఉన్నది. లెఫ్ట్ పార్టీల్లో ఒకటైన సీపీఐ హుజూర్ నగర్లో తెరాస కు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఆ పార్టీ అక్కడ మద్దతు ఇస్తుందా.. లేదంటే ఇది వేరు అది వేరు అనే సామెతలు చెప్తుందా. 


కార్మికుల కోసమే పుట్టిన పార్టీ అది.  మరి అలాంటి సమయంలో సిపిఐ పార్టీ ఎలా మద్దతు ఇస్తుంది.  ఇటు కార్మికులకు, అటు తెరాస కు జై కొడితే.. జనాలు ఏమనుకుంటున్నారు.  ఇప్పుడు సిపిఐ ముందున్న ఈ ప్రశ్నకు ఎలాంటి జవాబు చెప్తుందో చూడాలి.  సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు మద్దతుగా వచ్చాయి.  టిడిపి ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందన తెలియజేయలేదు.  అటు జనసేన కూడా ఈ విషయంలో ఎలాంటి స్పందన చేయలేదు.  జనసేన కార్మికుల మద్దతు ఇస్తుందా లేదా అన్నది కూడా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: