తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ఒకింత కారణం జగన్ ప్రభుత్వం అనే చెప్పాలి.  ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు.  ఇచ్చిన హామీకి తగ్గట్టుగా అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  అక్టోబర్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు.  దీంతో అక్కడ ఆనందం వెల్లివిరిసింది.  


ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు.  గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు.  కెసిఆర్ మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం దాన్ని భరిస్తూ.. జీతాలు ఇస్తోందని, ఇంకా జీతాలు పెంచాలి అంటే కుదరదని,అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని అన్నారు.  ఇది ఆర్టీసీ కార్మికులకు ససేమిరా నచ్చలేదు.  పైగా, ఆర్టీసీలో 1200 మంది ఉద్యోగులు ఉన్నారని, మిగతావారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణింపబడటం లేదని స్ఫష్టం చేసింది.  


అయితే, ఇప్పటి వరకు రాష్ట్రంలోని 78 డిపోల్లో ఉన్న 45వేలమంది కార్మికులు సమ్మెను ప్రశాంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు.  ఇప్పుడు అందరిని ఉద్యోగాల నుంచి తీసేస్తామం అంటే చూస్తూ ఊరుకుంటారా అన్నది ప్రధాన ప్రశ్న.  ఇదిలా ఉంటె, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీకి వైకాపా మద్దతు పలికింది. తెరాస కార్యకర్తలతో కలిసి పనిచేయాలని పిలుపును ఇచ్చింది.  అక్కడ ఉపఎన్నికల్లో కలిసి పనిచేస్తారు సరే.. 


మరి ఆర్టీసీ కార్మికులకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినట్టే వైకాపా కూడా మద్దతు ఇస్తుందా లేదంటే.. సైలెంట్ గా ఉంటుందా.. మద్దతు ఇస్తే తెరాస పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్టు.. మద్దతు ఇవ్వకుండా భవిష్యత్తులో తెలంగాణలో పార్టీకి మరిన్ని ఇబ్బందులు వచ్చినా రావొచ్చు. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల్లో పార్టీ బలంగా మారే అవకాశాలు ఉన్నాయి.  ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలంగా మారింది.  అక్కడ హామీలను నెరవేరుస్తోంది.  ఇప్పుడు తెలంగాణాలో కూడా పార్టీ బలంగా మరీ వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో ఇచ్చిన హామీలకు మాదిరిగానే తెలంగాణలో కూడా ఇస్తే.. అధికారంలోకి వచ్చినా రావొచ్చు.  చెప్పలేం కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: