అయ్యప్ప మాల ఎంత పవిత్రమైనదో అందరికి తెలిసిందే. స్వామివారి మాలను ధరించిన వ్యక్తులు నిష్ఠతో ఉంటారు.  ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటారు.  అయ్యప్పను నిత్యం మనసులో స్మరించుకుంటూ.. పనిచేసుకుంటూ వెళ్లారు.  మిగతా వ్యక్తులు వాళ్ళను స్వామి అని సంబోధిస్తారు.  ఇది ఎంతటి పవిత్రమైన భావనో అందరికి తెలిసిందే. పవిత్రమైన మాలను కొంతమంది వ్యక్తులు స్వార్దానికి వాడుకుంటున్నారు.  


అయ్యప్ప మాలను ధరించి మోసాలు చేస్తున్నారు.  ఇలా మాలను ధరించి పూజలు చేస్తామని చెప్పి ముగ్గురు వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు.  ఆ ముగ్గురుని గూడెం మాధవరం గ్రామంలో పట్టుకున్నారు.  జి కొండూరు పోలీసులకు అప్పగించారు.  గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి చెందిన వారా సాంబయ్య, వారా బాజీ, బూతుల సాంబయ్యలు అయ్యప్ప మాల వేసుకున్నారు.  


అలా పవిత్రమైన మాలను వేసుకున్న ఆ వ్యక్తులు కృష్ణా జిల్లా  వీరులపాడు మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ ఇంట్లో వ్యక్తులు త్వరలోనే జబ్బున పడబోతున్నారని, పూజలు చేయడం ద్వారా జబ్బులు తగ్గిస్తామని చెప్తున్నారు. ఆదివారం రోజున ఆ ముగ్గురు గూడెం మాధవరం గ్రామంలోని గద్దె రేణుక ఇంటికి వెళ్లి పెద్ద కుమార్తె 15 రోజుల్లో జబ్బున పడుతుందని, పూజలు చేస్తే తగ్గుతాయని చెప్పారు.  


అదే సమయంలో పొలం నుంచి ఇంటికి వచ్చిన రేణుక భర్తను బయట కూర్చోమని చెప్పారు.  అయన బయటకు వెళ్ళగానే బయట నుంచి అయన కుమార్తె వచ్చింది.  రేణుక పూజల కోసం 18వేల రూపాయలు వాళ్లకు ఇచ్చినట్టుగా చెప్పింది.  తీరా లోపలికి వెళ్లే సరికి ఆ ముగ్గురు కనిపించలేదు. గ్రామస్తుల సహాయంతో ముగ్గురిని పొలిమేరల్లో పట్టుకొని పోలీసులకు అప్పగించారు.  పోలీసులు తమదైన స్టైల్ లో అడిగేసరికి అసలు విషయం చెప్పేశారు.  డబ్బుల కోసమే ఇలా మాల వేసుకున్నట్టు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: