నిజంగా బాలయ్య గ్రేట్ అనాలి. ఆయన తండ్రి ఎన్టీయార్ సినీ వారసత్వమే కాదు, ఆయన క్రమశిక్షణ కూడా బాలయ్యకు వచ్చిందంటారు. ఆయనకు నటన అంటే ఉన్న అమితాస‌క్తి కూడా ఇందుకు మరో కారణం. అందుకే పద్నాలుగేళ్ల వాయసు నుంచి ప్రతీ ఏడాది మిస్ కాకుండా ఇప్పటివరకూ తన సినిమాలను రిలీజ్ చేస్తూనే ఉన్న ఏకైక హీరోగా బాలయ్యని చెప్పుకోవాలి. టాలీవుడ్లో బాలయ్యకు ఇన్న లాంగ్ కెరీర్ మరో హీరోకు లేదని కూడా చెప్పాలి.


ఇదిలా ఉండగా ఈ ఏడాది తన తండ్రి ఎన్టీయార్ బయోపిక్ రెండు పార్టులుగా తీసి జనవరి, ఫిబ్రవరిలలో వరసగా రిలీజ్ చేసిన బాలయ్య చేదు ఫలితాన్ని అందుకున్నారు. కొన్నాళ్ళ పాటు ఎన్నికలు, రాజకీయాల్లో బిజీగా గడిపిన బాలయ్య ఇపుడు కొత్త సినిమాను కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసి రిలీజ్ కి డేట్ కూడా ఫిక్స్ చేయడం గొప్ప విషయమే. 


దాంతో బాలయ్య సినిమాలు 2019లో వరసగా మూడు రిలీజ్ అవుతాయన్నమాట. ఈ విధంగా కూడా బాలయ్య కొత్త రికార్డునే నెలకొల్పారనుకోవాలి. ఒకపుడు ఇదే బాలయ్య, చిరంజీవి ఏడాదికి ఆరేడు సినిమాలు చేసేవారు. ఇపుడు మారిన ట్రెండ్ లో రెండేళ్ళకు ఒక సినిమాను థియేటర్లకు తేవడానికి యంగ్ హీరోలు తెగ కష్టపడిపోతున్నారు.


కానీ ఆరు పదుల వయసుకు చేరువలో ఉన్న బాలయ్య ఏమీ కాకుండా ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేయడం అంటే యంగర్ జనరేషన్ కి ఓ స్పూర్తి అనుకోవాలి. అలాగే సినీప్రియులకు కూడా ఇది గుడ్ న్యూస్ గా చూడాలి. మొత్తానికి బాలయ్య కొత్త సినిమా సంక్రాంతి కంటే ముందే రిలీజ్ అయి సందడి చేయనుదన్నమాట. బాలయ్య మూవీ డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాత సి కళ్యాణ్ చెప్పారు. ఈ మూవీలో స్టైలిష్ లుక్ తో బాలయ్య అదరగొడుతున్నారు. సొనాలి చౌహాన్, వేదిక ఇద్దరు అందాల తారలతో ఆడిపాడనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: