తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి పరిష్కారం చూపించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీకార్మికులు  భీష్మించుకు కూర్చున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని హెచ్చరికలు జారీ చేసిన ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఉద్యోగం నుండి పీకేస్తామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ... ఆర్టీసీ కార్మికులు మాత్రం సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. అయితే దసరా పండుగ ఆర్టీసీ నేపథ్యంలో  సమ్మె తో  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ సమ్మె ప్రస్తుతం ప్రయాణికులకు శాపంగా మారింది. 

 

 

 

 

 అయితే సమయం దొరికింది తడవు అన్నట్టుగా  ప్రవేట్ వాహనదారులు కూడా ప్రయాణికుల దగ్గర్నుంచి చార్జీలు పెంచి భారీగా వసూలు చేస్తున్నారు. ప్రవేట్ వాహనదారులు పెంచిన ఛార్జీలకు ప్రయాణికుల బెంబేలెత్తుతున్నప్పటికీ... ఏం చేస్తాం తప్పదు అన్నట్లుగా భావించి భారీ ఛార్జీలు చెల్లిస్తూ  ప్రయాణిస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని బస్సులు నడుపుతున్నామని చెబుతున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చడం లేదు అంతే కాకుండా ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో  కూడా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. 

 

 

 

 

 అయితే ఆర్టీసీ సమ్మె మొదలై మూడు రోజులు అవుతున్నప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ఇప్పటి వరకు సరైన నిర్ణయం తీసుకోలేదు. చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి కానీ కానీ సరైన పరిష్కారం మాత్రం చూపలేకపోయారు. ప్రవేటు వాహనాలు కూడా మూకుమ్మడిగా చర్చించి మరి చార్జీలు ఒక్కసారిగా పెంచేశారు. ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా ప్రజల కష్టాల గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వం,  ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు వాహదారులు ఇలా ఎవరి మీటింగ్స్ లో  వారు బిజీ బిజీగా ఉన్నారు. ఎవరు ఎక్కడ తగ్గడం లేదు కానీ... వీళ్ళందరి మధ్య అష్టకష్టాలు  పడుతుంది మాత్రం ప్రయాణికులే  కదా.  ప్రయాణికులు కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: