ఇప్పటి ఆంధ్ర రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మందుబాబులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే ఈ గుడ్ న్యూస్ ఆంధ్ర మందుబాబులకు కాదు, రాజస్థాన్ మందుబాబులకు ఇది గుడ్ న్యూస్. ఇంకా విషయానికి వస్తే రాజస్థాన్ రాష్ట్రంలో మద్యంపై నిషేధం విధించడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు.     


వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలంగా రాజస్థాన్ రాష్ట్రంలో మద్యనిషేధం విధిస్తున్నట్లు వార్తలు వచ్చి మందుబాబులకు అయోమయ స్థితిలోకి తోసేస్తున్నాయి. అయితే ఆ వార్తలు అన్ని పుకార్లేనాని, అతను మద్యనిషేధం విధించడం లేదని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో అక్రమంగా జరుగుతున్న మద్యం విక్రయాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నపుడే మద్య నిషేధం విధిస్తామని సీఎం చెప్పారు.       


అయితే తాను వ్యక్తిగతంగా మద్య నిషేధాన్ని అనుకులిస్తానని, కాని అక్రమంగా మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకున్న తర్వాతే మద్యంపై నిషేధాన్ని విధిస్తామని చెప్పారు. కాగా అయన మాట్లాడుతూ మధ్య నిషేధంపై గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేశారు. 1977లో ఒకసారి రాజస్థాన్ రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించినా, అమలులో విఫలమయ్యారని సీఎం చెప్పారు.     


గుజరాత్ రాష్ట్రంలో నిషేధం అమలులో ఉన్నా దేశంలోనే అత్యధికంగా మద్యం అక్రమంగా విక్రయం సాగిందని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ఇంకా ఎప్పుడు అయితే రాష్ట్రంలో మద్యం వినియోగం ఉండకూడదో ఆరోజే ఎక్కువ జరిగిందని, మహాత్మాగాంధీ జయంతి నాడే అయిన పుట్టిన గుజరాత్ లో మద్యం వినియోగం అధికంగా ఉందని అయన అన్నారు. ఏది ఏమైనా మధ్య నిషేధం విధించడం లేదు అనేది మందుబాబులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: