తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్రతరం అయ్యింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు.  ఈ స్ట్రైక్ మూడో రోజుకు చేరుకుంది.  సమ్మె చేసినా సరే ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.  ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేసింది.  ఎవరు ఏమనుకున్నా సరే.. ప్రభుత్వం చర్చలు జరపబోదని ఆర్టీసీ ఉద్యోగులుగా ఇప్పుడు కేవలం 1200 మందిలోపే ఉన్నారని చెప్పింది.  


అంటే మిగతా 40 వేలమంది ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు కారా అంటే కాదని ప్రభుత్వం చెప్తున్నది.  ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని తిప్పుతామని ప్రభుత్వం చెప్పింది.  2500 బస్సులు అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే స్పష్టం చేసింది.  ఆ బస్సులను ఏఏ రూట్లలో తిప్పుతున్నారో ఇంకా తెలియడం లేదు.  సమ్మెకు చేయడం నేరం ఘోరం అని ప్రభుత్వం చెప్తున్నది.  కార్మికులు మాత్రం ఇది తమ హక్కు అని అంటోంది.  


ఇద్దరు ఎవరికీ వారు మొండిపట్టుదలతో ఉన్నారు.  పట్టువీడకుండా సమ్మె చేస్తున్నారు కార్మికులు.  కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.  ఈ ఇద్దరి మధ్యలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు అన్నది కొంతవరకు వాస్తవమే అని చెప్పాలి.  ప్రయాణికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ బస్సులు భారీగా చార్జీలు పెంచుతున్నారని, భారీగా చార్జీలు పెంచడం వలన ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయని అంటున్నారు.  


కార్మికులు మాత్రం ప్రజలకు సర్ది చెప్తున్నారు.  కార్మికుల సమస్యలను అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు.  పండుగ సెలవులు కావడంతో ఏదోలా సెలవులు పెట్టుకొని ఊరికి వెళ్ళాలి అనుకున్న వ్యక్తులకు పాపం ఇలా బస్సుల బంద్ తో ఇబ్బందులు పడటం ఏంటో అర్ధం కావడం లేదు.  ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియడం లేదు.  దీనిపై ఏదొక పరిష్కారం త్వరాగా తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.  సెలవులంటే ఎలాగో గడిచిపోతాయి.  సెలవులు అయిపోయాక ఉద్యోగాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉంటె చాలు అని ప్రయాణికులు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: