ఓట్ల కోసం ఎన్ని హామీలు అయినా ఇస్తారు రాజకీయ నాయకులు..... తీరా గెలిచాక హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుకుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇప్పుడు మంచి దొరికింది అదే ఆర్టీసీ కార్మికుల సమ్మె....! సంవత్సరానికి రూ.1200 కోట్ల నష్టంతో, రూ.5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో.. ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ఒక సాహసమే అని చెప్పాలి కానీ ఎన్నికల వేళ ఆ సాహసానికి సైతం హామీ ఇచ్చారు తెలంగాణ సీఎం  కేసీఆర్. కానీ ఇప్పుడు ఆ హామీని ఎగ్గొట్టేందుకు పండుగ సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని కుండబద్దలు కొట్టేసారు, పైగా ఆర్టీసీ కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమని మండిపడ్డారు. ఆర్టీసీ సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు.



ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో జరిగిన సమ్మెలో కేసీఆర్ మాట్లాడుతూ  ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతున్నట్టు చెప్పారు. ప్రైవేట్-ప్రభుత్వ భాగస్వామ్యంతో ఆర్టీసీని నడబోతున్నట్టు....ఇందుకోసం తక్షణ చర్యగా 2500 బస్సులు అద్దె పద్దతిలో తీసుకుని నడపాలని నిర్ణయించారు.అతికొద్ది రోజుల్లోనే కొత్త సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అనేకరంగాలలో ముందుకు దూసుకుపోతున్న..... గత నలభై సంవత్సరాలుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న వ్యవహారం ఒక నిరంతర సమస్య కి  శాశ్వత పరిష్కారం కనుగొనలేకపోయారు. మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదు. బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఎదో నామ మాత్రంగా వున్నాయి.


కానీ కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయి. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే వారు సమ్మెకు దిగడం అవసరమా?. కెసిఆర్ ప్రశ్నించారుఆర్టీసీని లాభాల్లో నడిచే సంస్థగా రూపుదిద్దుకొని..... లాభాల్లోకి రావాలని  ఆకాంక్షింస్తున్నానని అన్నారు. ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లతో పాటు, రాష్ట్రంలోఉన్న  ప్రైవేట్ వాహనాలన్నీ ప్రజల రవాణాకు ఉపయోగపడేవేనని చెప్పారు. 
ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా కూడా లాభాలు రాబట్టాలన్నారు. అనేక రంగాలలో ముందున్న తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ విషయంలో కూడా ముందుండాలన్నారు. 

హైదరాబాద్ నగరం వరకు ఆర్టీసీ నష్టాలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రస్తుతం 10,400 బస్సులలో సుమారు కోటి మంది ప్రయాణం చేస్తున్నారని.. భవిష్యత్‌లో కూడా ఆ సౌకర్యం కొనసాగుతుందన్నారు.
 సగటున ఆర్టీసీ సిబ్బందికి నెలకు రు. 50,000 జీతం వస్తున్నా ఇంకా పెంచమని అడుగటం కరెక్ట్ కాదన్నారు. ఇలాంటి యూనియన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తల వంచదని తేల్చి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: