ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  గత మూడు రోజులుగా సమ్మె జరుగుతున్నది.  సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  సమ్మె వలన ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వం చెప్తున్నది.  కార్మికులు సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం మాత్రం దాని గురించి  పట్టించుకోవడం లేదు.  


పైగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఒప్పుకునే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంగా చెప్పేసింది.  ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఏకీభవించడం లేదు.  తమ డిమాండ్లు నెరవేరేవరకు సమ్మెను విరమించబోమని అంటున్నారు.  అవసరమైతే ఆర్టీసీలో ప్రైవేట్ వాహనాలు తీసుకొని నడుపుతామని చెప్తున్నారు.  ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు కాబట్టి.. ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు పెంచవద్దని చెప్తున్నది.  


ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య రగడ జరుగుతుండటంతో.. ప్రైవేట్ బస్సులు మాత్రం యథేచ్ఛగా చార్జీలు వసూలు చేస్తున్నారు.  అదేమంటే వెళ్లే సమయంలో జనాలు ఉంటున్నారని, వచ్చే సమయంలో అటు నుంచి ఎవరూ ఉండరు కాబట్టి బస్సు ఖాళీగా రావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు.  డబుల్ చార్జీలు వసూలు చెల్లించి ఊర్లకు వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉందని ప్రయాణికులు అంటున్నారు.  


మాములు రోజుల్లో 500 లేదా 600 రూపాయలు ఉంటె టికెట్ ధరలు ఈరోజు రెండు నుంచి మూడు వేలరూపాయల వరకు ఉంటున్నది.  ఇది మరీ దారుణమైన విషయంగా చెప్పాలి.  ఈ స్తాయిలో చార్జీలు వసూలు చేస్తున్నారు.  ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చార్జీలు పెంచడంతో చివరిగా లాస్ అవుతున్నది ప్రయాణికులే అన్నది స్పష్టం అవుతున్నది.  ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఈ సీజన్ లో మరింతగా సంపాదించుకునే అవకాశాన్ని ఆర్టీసీ, ప్రభుత్వం కలిపి కలిపిచింది అని చెప్పొచ్చు.  ఇద్దరు కొట్టుకొని మూడో వ్యక్తికీ లాభం చేకూరుస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: