గతంలో పగటి పూట గ్రామా సరిహద్దుల్లో, కొండల్లో జరిగే పేకాటలు ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలో అర్థరాత్రి పూట జరుగుతున్నాయి. ఏదో మీటింగ్ అని వారానికి ఒకరి ఇంటిలో పేకాట కార్యక్రమాన్ని జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా ఓ ఇంట్లో నిన్న ఆదివారం సందర్బంగా పేకాటా ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు 14 మంది.                       

                

వివరాల్లోకి వెళ్తే .. సిద్దిపేట జిల్లాలో మొత్తం 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ రేణుకానగర్‌లో ఓ ఇంటిలో ఆదివారం పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో సీఐ సైదులు, ఎస్ఐ రవీందర్, సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. 13 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 34,880 నగదు, 8 సెల్‌ఫోన్లు, 5 మోటార్ సైకిళ్లను, కార్డులను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.                     

                      

కాగా ఒకప్పుడు కొండల్లో, గ్రామా సరిహద్దుల్లో, పబ్బుల్లో పేకాట ఆడేవారు కానీ ఈ మధ్య కాలంలో గుట్టు చొప్పుడు కాకుండా ఇళ్లలో కూర్చొని పేకాట ఆడుతున్నారు. ఇళ్లల్లో కూర్చొని పేకాట ఆడుతున్నారు. మొన్నటికి మొన్న కుషాయ గూడలో ఓ ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. నిన్నటికి నిన్న సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏది ఏమైనా ఈ పేకాట రాయుళ్లను ఆపాలంటే పోలీసులకు కూడా కష్టమే అనిపిస్తుంది.               

                            

మరింత సమాచారం తెలుసుకోండి: