ఎన్నో  సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ వస్తే యూనివర్సిటీ అభివృద్ధి చెంది విద్య మెరుగుపడుతుందని భావించి కాకతీయ యూనివర్సిటీ మొత్తం కదిలి  తెలంగాణ ఉద్యమ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసింది. తెలంగాణ వచ్చింది కానీ కాకతీయ యూనివర్సిటీ పరిస్థితిలో  మాత్రం ఏ మార్పూ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పటికీ ఇప్పటికీ ఇంకా సమస్యలు ఎక్కువయ్యాయనే  అని చెప్పాలి. ప్రతిష్ట కలిగిన యూనివర్సిటీ ప్రస్తుతం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థులకు బంగారు భవిష్యత్తుని చూపించే విశ్వవిద్యాలయం పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రభుత్వం నుంచి నిధులు లేక... ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కాక ఉన్నత కోసం వచ్చిన విద్యార్థులకు సరైన విద్య అందించలేక పోతుంది కాకతీయ యూనివర్సిటీ. 

 

 

 

 

 

 గత పది ఏళ్ళ నుంచి బోధన బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నప్పుటికీ వాటి భర్తీకి ప్రభుత్వం చేయలేదు . కనీసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి  కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. అభివృద్ధికి కనీస నిధులు  కూడా కేటాయించకుండా కాకతీయ యూనివర్సిటీపై  నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది ప్రభుత్వం. 650 ఎకరాల  విస్తీర్ణంలో ఉన్న ఈ కాకతీయ యూనివర్సిటీలో 19 బ్రాంచీలను నిర్వహిస్తున్నారు. కాగా  యూనివర్సిటీలో 190 మంది కాంట్రాక్టు లెక్చరర్లు 200 మంది పార్ట్ టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూనివర్సిటీలో విద్యాబోధనకు... 391 మంది ప్రొఫెసర్లు అవసరం కాగా... ప్రస్తుతం 128 మంది ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు ఇంకా రెండు వందల అరవై మంది పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఏ చర్యలూ తీసుకోలేదు. 

 

 

 

 

 

 ప్రయోగశాలల  ఆధునీకరణ సహా వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వాన్ని వందకోట్ల నిధుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా... ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కోసం మంజూరు చేసిన నిధులు 15 కోట్లు మాత్రమే. దీంతో ప్రభుత్వం నుంచి సరైన నిధులు మంజూరు కాకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్ట కలిగిన కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కుంటుపడుతుంది. బోధన సిబ్బంది కూడా లేకపోవడంతో ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ కి వస్తున్నా విద్యార్థులకు కనీస విద్య కూడా అందడం లేదు. ప్రతిష్ట కలిగిన  కాకతీయ యూనివర్సిటీలో  పిహెచ్ డి  చదివేందుకు వస్తున్న విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. పి హెచ్ డి ఫీజు  400 శాతం పెంచడంతో పేద విద్యార్థులు బెంబేలెత్తుతున్నారు. ఫీజులు తగ్గించాలని  విద్యార్థులు ఎన్నిసార్లు అధికారులను కోరుతున్న  సిబ్బంది కనీసం  స్పందించడం లేదు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: