నేటికి తెలంగాణ ఆర్టీసీ సమ్మె తీరు.. ప్రజల్లో చాలా ఇబ్బంది కరంగా మారింది.. కానీ ప్రభుత్వం మాత్రం కఠినత్వాన్ని విడట్లేదు.. అందుకు కారణాలు లేకపోలేదు..
తెలంగాణా ఆర్టీసి వారి డిమాండ్లను  నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయార్థం ఆర్టీసీ జేఏసీ నేతలు మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది., ఇవాళ జరగాల్సిన ఆర్టీసీ జేఏసీ నిరాహార దీక్షను వాయిదా వేసారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ వారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ వారు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు..., భవిష్యత్తు ప్రణాళికల గూర్చి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
నేటికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె మూడవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం హెచ్చరికల ఆధారంగా ఆర్టీసీ ఉద్యోగస్థుల ఆందోళన మొదలైంది.  ప్రభుత్వాదేశాలసారం డిపో అధికారులు  తాత్కాలిక నియామకాలు చేపట్టనున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో ఎట్టిపరిస్థితుల్లోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని, కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపబోమని సీఎం కేసీఆర్‌ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. పండగ సమయంలో సమ్మెకు దిగే ప్రయత్నం ఆర్టీసీ కార్మికుల తీవ్రమైన తప్పని తేల్చిచెప్పారు. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని ఉద్యోగులను తిరిగి ఎప్పటికీ తీసుకోమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. మరోవైపు ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని ఆర్టీసీ  జేఏసీ తేల్చేసింది. తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్తామంటోంది.  తాము జీతాల కోసం సమ్మె చేయడం లేదని...ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నామని అన్నారు. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: