గ‌త ఐదేళ్లుగా ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ రాసింది రాత‌.. గీసింది గీత - ఆడింది ఆట‌... పాడింది పాట - చెప్పింది వేదం... చేసింది శాస‌నం అన్న‌ట్టుగా రెచ్చిపోయి మ‌రీ త‌న మీడిలో వార్త‌లు వండి వార్చేవారు. ఐదేళ్లుగా జ‌గ‌న్‌ను, వైసీపీని బ‌ద్నాం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేసిన రాధాకృష్ణ టీం ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. బీజేపీతో ఫైట్ చేయ‌డం మొద‌లు పెట్టాక మ‌రింత‌గా రెచ్చిపోయి బీజేపీపై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసింది.


ఎన్నికల ముందు మోడీని దింపేస్తా, బీజేపీని భూస్థాపితం చేస్తా, అమిత్ షాను పరుగులుపెట్టిస్తా అన్నంత రేంజ్‌లో రాధాకృష్ణ రాత‌లు ఉండేవి. ఇక చంద్ర‌బాబుకు ఓ రేంజ్‌లో బాగా ఊదిన రాధాకృష్ణ జ‌గ‌న్‌, బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఇప్పుడు తిరిగి బీజేపీ పెద్దలను ఆశ్రయించింది. ఎందుకంటే ఏపీలో ఏబీఎన్ ప్ర‌సారాలు ఆగిపోయాయి... తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ గెలుస్తాడ‌ని ముందుగా చెప్పి ఆ త‌ర్వాత మ‌హాకూటిమికి స‌పోర్ట్ చేయ‌డంతో అక్క‌డ కేసీఆర్‌తో అన‌వ‌స‌రంగా సున్నం పెట్టుకున్న‌ట్టు అయ్యింది.


ఇక ఇటు ఏపీలో బాబును భుజాన‌కు ఎత్తుకున్నందుకు వైసీపీ టార్గెట్ చేస్తోన్న దెబ్బ‌తో ఆర్కే విల‌విల్లాడుతున్నాడు. ఇక ఇప్పుడు ఆర్కేకు ఏదో ఒక రాజ‌కీయ అండ లేక‌పోతే మీడియాను న‌డ‌ప‌లేన్న‌ది అర్థ‌మైంద‌న్న గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అమిత్ షాను ఢిల్లీలో కలిశారు. చంద్రబాబుకు రాధాకృష్ణ కొన్నేళ్లుగా ప్రధాన రాజకీయ వ్యూహకర్తగా కూడా పనిచేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో తన చానల్‌ ప్రసారాలు నిలిపివేశారని అమిత్ షాకు రాధాకృష్ణ విన్నవించుకున్నారు. జగన్‌కు చెప్పి ప్రసారాలు పునరుద్దరించేలా చూడాలని అమిత్ షాను ఆర్కే కోరినట్టు చెబుతున్నారు. అందుకు ప్ర‌తిప‌లంగా ఆంధ్రాలో బీజేపీ బ‌లోపేతం విష‌యంలో తాను త‌న మీడియా ద్వారా విస్తృత‌మైన క‌వ‌రేజ్ ఇస్తాన‌ని ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం అమిత్ షానే రాధాకృష్ణను ఆహ్వానించారని చెబుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: