జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల.. ప్రభుత్వాధినేతలను ప్రశ్నిస్తుందా.. పాలనలోని లోపాలపై గళమెత్తుతుందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైనా సడలని ధైర్యంతోనే జనసేనాని ముందుకెళ్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా జనసేన ఉంటుంది అని గతంలోనే ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై, నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలపై, ఆయనపై ఉన్న కేసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

 


‘ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ ఉద్యోగిని సరళపై కోటంరెడ్డి దాడి చేస్తే వైసీపీ ఎందుకు ఖండించలేదు? ప్రజాప్రతినిధులే చట్టాన్ని గౌరవించకపోతే.. విలువ ఎక్కడుంటుంది. సమస్యలపై రోడ్డుకెక్కితే నాన్ బెయిల్‍బుల్ కేసు ఎలా అవుతుంది. మహిళా ఉద్యోగిపై దాడి చేసిన కోటంరెడ్డిపై సెక్షన్ 448, 421 కేసులా? ప్రభుత్వ ఒత్తిడితోనే కోటంరెడ్డిపై నాన్‍ బెయిల్‍బుల్ కేసులు పెట్టలేదు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలి’ అంటూ పవన్ కల్యాణ్ స్పందించారు. పవన్ స్పందించిన తీరుపై వైసీపీ నాయకుల నుంచి ఎటువంటి స్పందనా ఇంతవరకూ రాలేదు. అయితే.. పవన్ స్పందనపై వైసీపీ వర్గాలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసేవిగా ఉన్నాయి. కోటంరెడ్డిపై సాక్షాత్తూ సీఎం జగన్ స్పందించడం ఇక్కడ విశేషం. వైసీపీ నుంచి ఎందుకు స్పందన లేదన్నది పవన్ కల్యాణ్ వాదన. మరి దీనిపై వైసీపీ వర్గాలు ఏవిధంగా స్పందిస్తాయో.. వీటిని పవన్ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.

 

 

సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయ నాయుకుడిగా మారిపోయారు. ప్రశ్నించడం కోసమే పార్టీ స్థాపించానంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఈ ఐదేళ్లలో అనేక సార్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: