ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సంచలన నిర్ణయాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాడు. అతను తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా ప్రజలకు మంచి జరిగేలా ఆ నిర్ణయాలు అమలు అయ్యేలా సీఎం జగన్ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తీసుకున్న మరో కీలక నిర్ణయం కేంద్రానికి షాక్ ఇచ్చింది.  


ఏ రాష్ట్రంలోనైనా సరే.. కొన్ని ప్రభుత్వ పథకాలలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం కూడా నిధులను కలిపి ఇస్తుంది. ఆ పథకాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్న ఆ క్రెడిట్ అంత కేంద్రానికి దక్కదు. ఎందుకంటే ఆ పధకాలను రాష్ట్రమే అమలు చేస్తుందని ప్రజలు భావిస్తారు. అయితే ఇంకా ఆలా కాకుండా కేంద్రం సాయం చేస్తున్న పథకాలలో క్రెడిట్ కేంద్రానికే ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నాడట. 


ఇప్పటికే రైతు భరోసా పథకంలో కేంద్రానికి క్రెడిట్ ఇస్తున్న సీఎం జగన్ ఆ పథకం ప్రారంభానికి ప్రధాని మోదీని కూడా సీఎం జగన్ ఆహ్వానించారు. కానీ ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే దాని పై క్లారిటి ఇంకా ఇవ్వలేదు. త్వరలోనే ఆంధ్రాలో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీంను ప్రధాని మోడీ పేరుతోనే అమలు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం. 


మరి ఈ పథకంలో రాష్ట్రం వాటా ఉన్నప్పటికి కేంద్రం వాటా ఎక్కువ ఉండడంతో కేంద్రానికే ఈ పథకం క్రెడిట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కేంద్రం ప్రస్తుతం షాక్ లో ఉంది. ఏ నాయకుడు అయినా తనకే క్రెడిట్ రావాలనుకుంటాడు.. ఈ సీఎం ఏంటి ? ఎవరి క్రెడిట్ వారికే ఇవ్వాలనుకుంటున్నాడు అని ఆశ్చర్య పోతున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: