తెలంగాణాలో ఒకే ఒక చోట ఉన ఎన్నిక జరుగుతోంది. నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ లో జరిగే ఉప ఎన్నికను అధికార టీయారెస్ ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీంతో సర్వ శక్తులు సర్కార్ ఉపయోగిస్తోంది. చేతిలో పవర్ ఉంది. అంగ బలం, అర్ధబలం మెండుగానే ఉన్నాయి. దీంతో టీయారెస్ పదునైన వ్యూహాలను రచిస్తోంది. మరో వైపు పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డికి ఇది చాలా కీలక‌మైన సీటు. ఆయన ఏడాది క్రితం గెలిచిన సీటు ఇది. పైగా పీసీసీ పెద్ద. పోటీలో ఉన్నది సతీమణి. దాంతో కాపాడుకోవాల్సిన బాధ్యత ఉత్తమ్  మీద చాలానే ఉంది.


మిగిలిన  పార్టీల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ వంటివి ఉనికి కోసం పోరాడేందుకు మాత్రమే. ఇక టీడీపీ వ్యూహం ఆలోచిస్తే అక్కడ ఓట్లలో చీలిక తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ కి మేలు చేయాలనుకుంటోందని వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయడానికి ఎవరు వస్తారు అన్న చర్చ సాగుతూండగానే బాలయ్యని బరిలోకి దించుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


బాలయ్య హుజూర్ నగర్ ప్రచారానికి వస్తున్నారుట. టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయికి మద్దతుగా బాలయ్య ఈ నెల 13 నుంచి 18 వరకూ ఆరు రోజుల పాటు విస్త్రుతంగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. బాలయ్య ప్రచారానికి వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అక్కడ  ఆయన చేసే ఉపన్యాసాలు కామెడీ ట్రాక్ గా సోషల్ మీడియాలో మళ్ళీ మారు మోగడం ఖాయంగా కనిపిస్తోంది.


ఇదే విధంగా బాలయ్య తెలంగాణా సార్వత్రిక ఎన్నికల్లో  ప్రచారం చేశారు.  ఆయన తన అన్న హరిక్రిష్ణ కుమార్తె సుహసిని  కోసం చేసిన ప్రచారం వికటించింది కూడా. బుల్ బుల్ అంటూ బాలయ్య సారే జహాసే  అచ్చా పాటను ఖూనీ చేసేసారు. మరిపుడు హుజూర్ నగర్లో  బాలయ్య మార్క్ దబిడి దిబిడి ఎలా ఉంటుందోనని అనుకుంటున్నారు. మరి టీ టీడీపీకి ఇంతకంటే వేరే ప్రచారం చేసే నేత లేడని తెలుస్తోంది. సో బాలయ్య తప్ప మరొకరు రాని పరిస్థితి ఉన్న వేళ ఆయన ఏం చెప్పినా వినాల్సిందే. మరి ఫలితం గురించి మాత్రం అడగొద్దు అంతే..


మరింత సమాచారం తెలుసుకోండి: