సరిగ్గా నాలుగేళ్ల క్రితం బెంగళూరు నగరంలోని చర్చివీధుల్లో జరిగిన బాంబు పేలుళ్ళ అగ్గిసెగ నేటికి ఆ రాష్ట్ర ప్రజలతో బాటు భారత్ లో ఇంకా రగులుతుందనే చెప్పుకోవాలి.. ఆ బాంబు పేలుళ్ళ కేసులో నిందితుడిగా ఉన్న అఫాక్ లంకా (కార్వారా) అతని భార్య అర్సల అబిర్‌ (పాకిస్తాన్‌) ల వీసాని రద్దు చేసి..,, తమ స్వదేశానికి వెంటనే తీసుకెళ్లి పోవాలని మన కేంద్ర హోంశాఖ వారు ఆదివారం నాడు ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే...,, కార్వార్కు చెందిన అఫాక్‌ లంకా కొంత కాలం క్రితం బ్రతుకు తెరువు కోసం దుబాయ్‌ వెళ్ళి అక్కడ పరిచయమైన పాకిస్తాన్‌ యువతి అర్సల అబిర్‌ ని వివాహం చేసుకున్నాడు. వారి వివాహానంతరం కొంత కాలం పాటు పాకిస్తాన్‌లో జీవనం సాగించారు. కొంతకాలానికి అనగా 2006లో అతను భార్య పిల్లలతో కలిసి తన స్వగ్రామమైన కార్వారాకి వచ్చారు.
2015లో బెంగళూరు చర్చివీధిలో జరిగిన బాంబు పేలుళ్ల విషయం తెలిసిందే కదా. ఈ కేసులో భాగంగా అఫాక్‌లంకాని నిందితుడిగా గుర్తించిన ఎన్‌.ఐ.ఏ అధికారులు అప్పటి నుంచి అతన్ని విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి ఉంటున్న అఫాక్ భార్య (అర్సల అబిర్‌) వీసా రద్దు చేసి ఆమె స్వదేశమైనా పాకిస్థాన్ కి వెళ్లాలంటూ మన ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారు.
చర్చి పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అఫాక్ లంకాతో పాటు తన భార్య అర్సల అబిర్‌ బ్యాంకు ఖాతాలకు పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థల నుంచి నిధులు జమ అయినట్లు..,, ఎన్‌.ఐ.ఏ దర్యాప్తులో తేలడంతో కేంద్ర హోం శాఖ వారి వీసాను రద్దు చేసి తమ స్వదేశాలని వెళ్లాలని సూచించింది.  
ఏది ఏమైనప్పటికీ ఇలా మన శతృదేశం వారు ఎన్ని మార్లు పథకం రచించిన మన ప్రభుత్వం వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటు మనల్ని రక్షిస్తున్నారనే చెప్పికోవాలి.. వెంటనే అఫాక్ లంకా తన భార్యతో వారి దేశానికి వెళ్లిపోవాలని ఆశిద్దాం.....

మరింత సమాచారం తెలుసుకోండి: