హైద‌రాబాద్‌లో ప్రైవేటు వాహ‌న స‌ర్వీసుల‌ సేవ‌ల‌ను వినియోగించుకునే వారికి సంబంధించిన ముఖ్య‌మైన స‌మాచారం ఇది. ప్ర‌జల భద్రత కోసం ఇప్పటికే అనేక యాప్‌ లను అందుబాటులోకి తీసుకొచ్చితెలంగాణ పోలీసులు మ‌రో ముంద‌డుగు వేశారు. రాత్రివేళల్లో క్యాబ్‌ లో ప్రయాణించే మహిళలకు ఎంతగానో ఉపయోగపడే ఇంటిగ్రేషన్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్యాట్రోల్స్‌ విత్‌ ప్యాసింజర్‌ క్యాబ్‌ సర్వీసెస్‌ పేరుతో రూపొందించిన సరికొత్త టెక్నాలజీని డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రారంభించారు.


ఈ నూత‌న సేవ‌ల ప్ర‌కారం, ఎమర్జెన్సీ సమయంలో క్యాబ్‌ సర్వీస్‌ యాప్‌ లో ఉన్న ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగానే.. పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ కు మెసేజ్‌ వెళ్తుంది. అంతేకాకుండా దగ్గర్లోని  పెట్రోలింగ్‌ వాహనానికి, పోలీస్‌ స్టేషన్‌ కు, ఏసీపీ, డీసీపీకి కూడా నోటిఫికేషన్‌ వెళ్తుంది. దీంతో హుటాహుటిన సంబంధిత పోలీసు అధికారులు.. క్యాబ్‌ ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. నేరం జరగకముందే నేరస్థులను పట్టుకుంటారు. పోలీసులు అందుబాటులోకి తెచ్చిన ఈ టెక్నాలజీకి ఇప్పటికే ఓలా, డోరా, టీఎస్‌ టూరిజం, ప్రైడో లాంటి పలు క్యాబ్‌ సర్వీసెస్‌ లు అనుసంధానం అయ్యాయి.ట్రావెల్‌ మేడ్‌ కంప్లిట్లీ సేఫ్‌ అనే నినాదంతో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. 


విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ లో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యల్లో భాగంగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ టెక్నాలజీతో అనుసంధానమైన క్యాబ్‌ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా పనిచేస్తుంది. పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ లో ఒక స్పెషల్‌ వింగ్‌ దీన్ని నిరంతరం మానిటరింగ్‌ చేస్తుంది. టెక్నాలజీతో అనుసంధానం అయిన క్యాబ్‌ సర్వీసెస్‌ లను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. లు చేపట్టింది. రాష్ట్ర పోలీసులు గతంలో ప్రారంభించిన హ్యాక్‌ ఐ యాప్‌ ను డౌన్‌ లోడ్‌ చేసుకోనప్పటికీ ఆపద సమయంలో ఈ సేవలను పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: