దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బీభత్సం చేసేందుకు తీవ్రవాదులు కుట్రలు పన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది.దాంతో మైసూరులో  దసరా సంబరాల పై పాకిస్థాన్‌ ఉద్దేశిత ఉగ్రవాదులు పన్నాగాలు చెయ్యబోతున్నట్టు సమాచారం.

మైసూరు పక్కనే ఉన్న శ్రీరంగపట్టణ పరిధిలో శాటిలైట్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. ఆదివారం కిక్కేరి పరిధి లోను శాటిలైట్‌ ఫోన్‌ వాడినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. అలాగే హొళెనరసీపుర తాలుకా నుంచి తూర్పు ముఖంగా 15 కిలోమీటర్ల పరిధిలో శ్యాటిలైట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి పోలీసులకు సమాచారం వచ్చిందట. ఈ నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీ చేసి శ్రీరంగపట్టణ సమీపంలో నలుగురిని అదుపులోకి తీసుకొని వారిని  ప్రశ్నిస్తున్నారు అని అక్కడి అధికారులు తెలిపారు. వారి నుండి శాటిలైట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు.

భద్రతా బలగాలు, పోలీసులు తప్ప ఇతరులు శాటిలైట్‌ ఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతి లేదు. విదేశాల్లో ఉన్నవారితో రహస్యంగా ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదని. ఉగ్రవాదులు శాటిలైట్‌ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు అంటూ కూడా అధికారులు పేర్కొన్నారు. మైసూరుతో పాటు మండ్య, హాసన్, చామరాజనగర జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. శాటిలైట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నట్లు గత వారం రోజులుగా ప్రచారం కూడా సాగుతోంది. వారు ఉగ్రవాదులా, కాదా అనేది తేలాల్సి ఉంది.విదేశాల్లో శాటిలైట్‌ ఫోన్లకు అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులు ఇక్కడికి వచ్చి వినియోగించి ఉండవచ్చని కూడా అధికారులు భావిస్తున్నారు. అయితే కరావళి ప్రాంతంలో భద్రతను పెంచినట్లు హోంమంత్రి బసవరాజు బొమ్మై తెలిపారు. ఉగ్రవాద భయాల నేపథ్యంలో మైసూరు నగరంలోను, ప్యాలెస్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్యాలెస్‌ ఆవరణలోకి పాస్‌లు ఉన్నవారినే అనుమతిస్తారు. బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అనుమానితులను విచారిస్తున్నారు.మనం పూజ చేసే ఆ అమ్మే ఉగ్రమూకల నుండి మనల్ని రక్షించాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: