ఈ మద్య పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కు భంగపాటు మీద భంగపాటు పరంపరగా తగుల్తూనే ఉన్నాయి. ఆయనకు ఇచ్చిన విమానం తిరిగి ఇచ్చాయాలంటూ సౌదీ  యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ డిమాండ్ చేశారట. దీంతో విదేశీ పర్యటన మద్యలోనే ఇమ్రాన్ అర్ధంతరంగా అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యి ఫ్లైట్‌ను సౌదీ తిరిగి పంపించేశారు. 

 

వివరాలే మంటే - ఇటీవల అమెరికా పర్యటన పూర్తిజేసుకొని  తిరిగి వస్తున్న ఇమ్రాన్ ఖాన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని ఆయన న్యూయార్క్‌ లోనే మళ్లీ ల్యాండ్ అయ్యారని వార్తలు వచ్చాయి. 

 

ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ కమర్షియల్ ఫ్లైట్‌ లో పాక్ చేరుకున్నారు. అయితే దీనిపై ఇమ్రాన్ పాక్ చేరిన తరవాత "అసలు కారణం వేరే ఉందని ఇమ్రాన్ ప్రయాణించే సౌదీ యువరాజు విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తలేదని - పాక్ కు చెందిన వారపత్రిక ‘ఫ్రైడే టైమ్స్‌’  ఒక కథనం అందించింది. అదేమంటే:

 

ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లే ముందు ఇమ్రాన్ ఖాన్ సౌదీ లో రెండు రోజుల పాటు పర్యటించారు. అయితే ప్రధానిగా వచ్చిన ఇమ్రాన్ ఖాన్‌ను కమర్షియల్ ఫ్లైట్‌లో పంపడం ఇష్టం లేక, సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తన వ్యక్తిగత జెట్ ఫ్లైట్ ఇచ్చి అతిథిని గౌరవించాడట. ఇమ్రాన్ ఖాన్ ఆ ఫ్లైట్‌ లోనే అమెరికా పర్యటనకు తన బృందం తో కలిసి వెళ్లారు.

 

అయితే ఇమ్రాన్‌ ఖాన్ ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ప్రదర్శించిన దౌత్యనీతిని సహించలేక పోయారట సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌. ఆయన  తన వ్యక్తిగత ఫ్లైట్‌ లో అతిథి మర్యాదలు ఘనంగా చేసి పంపిన సల్మాన్‌ — తిరిగి తన విమానాన్ని తనకు వెంటనే అప్పగించాలని పాక్‌ బృందాన్ని కోరారట. 

 

అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో సౌదీ రాజు ఆదేశాలతో ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ లాండింగ్ చేసి సౌదీ పంపినట్లు తెలుస్తుంది. పరువు కాపాడు కోవటానికి సౌదీ రాజు వ్యక్తిగత విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందన్నవార్తలు ప్రచారం చేయించినట్లు తెలుస్తుంది. 

 

తప్పని పరిస్థితుల్లో ఒక కమర్షియల్ ఫ్లైట్‌ లో ఇస్లామాబాద్‌కు ఇమ్రాన్ ఖాన్ చేరుకోక తప్పలేదు. అయితే అవి పూర్తిగా అవాస్తవమని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌, మలేషియా ప్రధాని మహతిర్‌ మహ్మద్‌తో కలిసి ఇస్లామిక్‌ దేశాల వాదనను వినిపించాలనుకోవడం సౌదీ యువరాజుకు నచ్చలేదని పాక్ ప్రముఖ వీక్లీ  ఫ్రైడే టైమ్స్ పేర్కొంది. 

 

తన అనుమతి లేకుండా ఇరాన్‌ తో చర్చలు జరపడంపై కూడా మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సీరియస్ అయ్యారని తెలిపింది. అందుకే తన విమానాన్ని తిరిగి ఇచ్చేయాలని ఇమ్రాన్ ను కోరి తన అసంతృప్తిని వ్యక్తం చేశారని కథనం రాసింది. మొత్తం మీద ఇమ్రాన్ ఖాన్‌కు సౌదీ యువరాజు గట్టి షాక్ ఇచ్చారని అంతర్జాతీయంగా అనేకమంది చర్చించుకుంటున్నారు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: