ప్రపంచంలో పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది యాచకవృత్తి అని చెప్పాలి.  పెట్టుబడి పైసా అక్కర్లేదు.  సిగ్గు అన్నది పక్కన పెట్టి డబ్బు కావాలి అనే ఒకే ఒక్క లక్ష్యం పెట్టుకుంటే చాలు.. డబ్బు అదే వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు డబ్బును యాచించినా సాయంత్రం వరకు కనీసం 100 నుంచి 200 వరకు సంపాదించుకోవచ్చు.  సెలవులు వంటివి ఉండవు.. ఎవరో ఒకరు ఎదో ఒకటి పెడతారు.  తినేసి ఎంచక్కా యాచక వృత్తిలోకి దిగితే చాలు.. 


ముంబైలో చాలామంది ఈ వృత్తిని ఎంచుకొని లక్షలు సంపాదిస్తున్నవాళ్ళు ఉన్నారు.  బ్యాంకుల్లో లక్షల సొమ్ము జమచేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు.  చాలామంది ఈ సొమ్మును అప్పులుగా ఇస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలా వచ్చిన డబ్బును వివిధ వాటిల్లో పెట్టుబడిగా పెడుతుంటారు.  అయినా వారు యాచక వృత్తిని మాత్రం వదలరు.  ఎందరో ఇలా ఈ వృత్తిద్వారా సంపాదిస్తున్నారు.  


ఇలా యాచక వృత్తిని స్వీకరించి ప్రతిరోజూ బిక్షం ఎత్తుకునే బార్బీ చాంద్ ఆజాద్ అనే 62 సంవత్సరాల వయసుకలిగిన వ్యక్తి ఇటీవలే ముంబైలోని గోవండి ప్రాంతంలో రైల్వే ట్రాక్ దాటుతూ దాటుతుండగా ట్రైన్ వచ్చి గుద్దేసింది.  దీంతో ఆ ముసలాయన చనిపోయాడు.  పోలీసులు ఆ ముసలాయకు సంబంధించిన సమాచారం కనుక్కొని ఆయన నివసించే ఇంటికి చూడగా ఇంట్లో సంచుల్లో డబ్బులు కనిపించాయి.  ఆ డబ్బులు మొత్తం లెక్కేయడానికి పోలీసులకు 8 గంటల సమయం పట్టింది.  అంతా చిల్లరే.  దాదాపు లక్షన్నరకు పైగా చిల్లర ఉంది.  


ఆ ఇంట్లో దొరికిన వివరాలను బట్టి అతనిది రాజస్థాన్ అని తేలింది.  బ్యాంకులో 9 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.  బ్యాంకులో అతని బ్యాలెన్స్ చూసి షాక్ అయ్యారు.  రాజస్థాన్ లో ఉన్న అతని బంధువుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  అతని బంధువులు గురించి తెలిసిన తరువాత ఆ డబ్బును వారి బంధువులకు అప్పగిస్తారట.  యాచక వృత్తి చేస్తూ ఎంతమొత్తంలో ఎలా సంపాదించాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: