టిడిపి నేత, దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇటీవలే దళితులను దూషించిన కేసులో అరెస్టయిన చింతమనేని ప్రస్తుతం రిమాండ్‌ లో ఉన్నారు. 2018 లో పెదవేగిలో మురళీకృష్ణ అనే వ్యక్తిని నిర్బంధించి దాడిచేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేసిన పోలీసులు, చింతమనేనిని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది.


గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. టీడీపీ అండతో, చంద్రబాబు ప్రోద్బలంతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. ఈ క్రమంలో చింతమనేని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులను కొట్టడం, సివిల్ పోలీసులు పై దాడులు, దౌర్జన్యాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో దౌర్జన్యాలు ఇటు వంటి కార్యక్రమాలతో చెలరేగిపోయిన చింతమనేని దళితులను అనేకసార్లు దూషించారు. అంతే కాకుండా తన తప్పు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని, ఎన్ని కేసులు పెట్టుకుంటే అన్ని పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ తనని తప్పుడు కేసుల్లో ఇరికించాలని చూడటం దారుణమనే నీతులు పలికారు.


అవన్నీ గాల్లో కలసి,ఇటీవల చింతమనేని పాపం పండడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్ కు తరలిస్తున్న సమయంలో కూడా కోర్టు ఆవరణ వద్ద చింతమనేని మరోసారి పోలీసులపైనే దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు. చివరికి ఇలా అడ్డంగా బుక్కైయ్యాడు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనేది చింతమనేని పరిస్దితిని చూసి ఇప్పుడు రౌడీ ఇజంతో ప్రవర్తించే ఎమ్మెల్యేలంతా జాగ్రత్త పడుతున్నారు.


ఇకపోతే అజ్ఞాతంలో వున్న చింతమనేని ప్రభాకర్ భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరగా ఆయన అజ్ఞాతం వీడి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు.. ఈలోపే పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి. వైద్య పరీక్షలు నిర్వహించి..జడ్జి ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించారు. ఈ రిమాండ్ కొనసాగుతుండగానే మరో మూడు కేసుల్లో రిమాండ్‌లకు వెళ్లారు. దీంతో ఆయన ఇన్నిరోజుల నుండి జిల్లా జైలులోనే ఉన్నారు. అయితే చింతమనేనిపై తప్పుడు కేసులు పెడుతున్నారని టీడీపీ ఆరోపించడం హాస్యాస్పదం అనుకుంటున్నారు కొందరు ఈ విషయం తెలిసిన వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: