ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  చలికాలం ప్రారంభం కావడంతో ఉగ్రవాదులను ఇండియాలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇండియాలోకి 300 మందికి పైగా ఉగ్రవాదులు ప్రవేశించినట్టు సమాచారం.  ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే ఐరాస సర్వసభ్య సమావేశాలు జరిగాయి.  


ఈ సమావేశాలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యే ముందు సౌదీ వెళ్లారు.  సౌదీకి వెళ్లి అక్కడి యువరాజు చర్చలు జరిపారు.  అనంతరం అమెరికా వెళ్లేందుకు మాములు ప్రయాణికుల విమానంలో ప్రయాణించేందుకు సిద్ధం అయ్యారు.  అయితే, సౌదీ యువరాజు పాక్ ప్రధానికి తన ప్రైవేట్ జైట్ ఫ్లైట్ ఇచ్చారు.  ఆ విమానంలోనే అయన ఐరాస సభకు హాజరయ్యారు.  


ఐరాసలో ప్రతి ఒక్కరికి 15 నుంచి 17 నిమిషాలు  సమయం కేటాయిస్తుంది.  ఈ సమయంలోనే ఆయా దేశాల ప్రతినిధులు మాట్లాడాలి.  ప్రధాని మోడీ 17 నిమిషాల్లో ప్రసంగం ముగించారు.  శాంతి.. సామరస్యం.. పర్యావరణం వంటి వాటిపై మాట్లాడారు.  ఆయితే, 15 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించాల్సిన పాక్ ఏకంగా 50 నిమిషాలపాటు మాట్లాడింది.  మొత్తం కాశ్మీర్ సమస్య ఉగ్రవాదం.. ఇండియాపై ఆరోపణలు ఇవే ఉన్నాయి.  


ఇవి తప్పించి మరో విషయం లేదు.  దీంతో సభ్యదేశాలు కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేశాయి.  ఐరాసలో పాక్ మాట్లాడిన తీరు సౌదీకూడా నచ్చలేదు.  ఐరాస నుంచి తిరిగి వచ్చే సమయంలో విమానంలో సాంకేతిక్ సమస్యలు వచ్చాయని ఫ్లైట్ ను అత్యవసరంగా న్యూయార్క్ లో ల్యాండ్ చేశారు.  అక్కడి నుంచి ఇమ్రాన్ ఖాన్ వేరే విమానంలో ఇస్లామాబాద్ వెళ్లారు.  అయితే, సౌదీ యువరాజు ఇమ్రాన్ ను విమానం తిరిగి వెనక్కి ఇచ్చెయ్యమని చెప్పారని, ఐరాసలో మాట్లాడిన తీరు ఆయనకు నచ్చలేదని, అంతేకాకుండా.. ఇరాన్ తో చర్చలు జరపడం కూడా కొంత అసహనానికి గురి చేసినట్టుగా తెలుస్తోంది.  అయితే, ఈ విషయాన్నీ పాక్ మాత్రం కొట్టేస్తోంది.  అలాంటిది ఏమి లేదని, సౌదీ.. పాక్ లు మంచి స్నేహితులని అంటున్నాడు.  సౌదీ యువరాజు ఆదేశాల ప్రకారమే ఫ్లైట్ ను న్యూయార్క్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని... అక్కడి నుంచి ప్రధానిని దించేసి విమానం సౌదీ వెళ్లిపోయిందని పాక్ మీడియానే కథనాలు రాసింది. దీనికి సంబంధించి తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని పాక్ మీడియా ఫ్రైడే టైమ్స్ చెప్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: