సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటు ప్రశంసలు అందుకుంటున్నారు . ఇప్పటికే ప్రజల సంక్షేమం కోసమే ఎన్నో కీలక  నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు  ఉన్నారు. కాగా  ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి. వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. 

 

 

 

 

 వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం... ఈ నెల 13న వాల్మీకి జయంతి కార్యక్రమం అని అధికారికంగా నిర్వహించనుంది. అయితే  ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిని  రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ జయంతి నిర్వహించేందుకు గాను అన్ని జిల్లాలకు కలిపి 25 లక్షల రూపాయల నిధులను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రామాయణం రచించిన గొప్ప వ్యక్తి అయినా వాల్మీకి జయంతిని  రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించేందుకు  జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తో... ముఖ్యమంత్రి నిర్ణయం పై రాష్ట్ర ప్రజలు  హర్షం వ్యక్తం చేస్తున్నారు..

 

 

 

 

 రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే   ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తు పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు జగన్ .ఇక  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మద్యపానం నిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు జగన్ .

మరింత సమాచారం తెలుసుకోండి: