నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  ఈ రాజకీయాలు అధికార-ప్రతిపక్షాల మధ్య కాదు. అధికారపార్టీలోనే ఉన్న వైసిపి కీలక నేతల మద్య. అవును నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి టార్గెట్ గా రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీలోని కొందరు కీలక నేతలు కోటంరెడ్డిని లక్ష్యంగా  చేసుకుని రాజకీయాలు మొదలుపెట్టటంతో వైసిపిలో కలకలం మొదలైంది.

 

మొన్నటి ఎన్నికలకు ముందు నుండే కోటంరెడ్డి టార్గెట్ గా చేసుకుని ఎంపి, ఎంఎల్ఏ రాజకీయం మొదలుపెట్టారట. దానికి పరాకాష్ట ఏమిటంటే  మొన్నటి ఎంపిడివో సరళ తో కోటంరెడ్డికున్న వివాదం. నిజానికి ఎంపిడివో వివాదం చాలా చిన్నదనే చెప్పాలి. కాకపోతే సరళని వెనకుండి నడిపిస్తున్న కీలక నేతలపై ఒక్కసారిగా ఆరోపణలు, విమర్శలు మొదలైపోయాయి.

 

ఎన్నికలకు ముందు వైసిపిలో చేరి ఎంపిగా టికెట్ తెచ్చుకుని గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎంఎల్ఏ కాకాణి గోవర్ధనెడ్డికి కోటంరెడ్డికి పదటం లేదని సమాచారం. నిజానికి కాకాణికి కోటంరెడ్డితో మంచి సంబంధాలే ఉన్నా ఆదాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందట. మొన్నటి ఎన్నికల్లో తన పార్లమెంటు పరిధిలోని అందరు అసెంబ్లీ నియోజకరవర్గాల్లోని అభ్యర్ధులకు డబ్బులు సర్దుబాటు చేసిన ఆదాల నెల్లూరు రూరల్ అభ్యర్ధికి మాత్రం ఇవ్వలేదట.

 

అయితే నెల్లూరు నుండి రాజ్యసభ ఎంపిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఉన్న సంబంధాల కారణంగా ఎన్నికల్లో కోటంరెడ్డికి ఆర్ధిక సాయం అందిందని పార్టీలో ప్రచారంలో ఉంది. అప్పటి నుండే ఆదాల-కోటంరెడ్డి మధ్య గొడవలు మొదలయ్యాయట. ఆదాలకు కాకాణి కూడా తోడవ్వటంతో వీళ్ళ గొడవ మరింతగా పెరిగిందని సమాచారం.

 

మామూలుగానే కోటంరెడ్డికి దూకుడు,  ఆవేశం ఎక్కువ. అదుకనే ఎన్నికలు పూర్తయిన వెంటనే ఓ జర్నలిస్టుతో గొడవ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు ఎంపిడివో వివాదం రేగటంతో వైసిపి మీద నెగిటివ్ ప్రచారం మొదలైపోయింది. ఇటువంటి గొడవలు కంట్రోట్ చేయలేకే చంద్రబాబునాయుడుకు చెడ్డపెరొచ్చింది. ఇపుడు కోటంరెడ్డి లాంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి కూడా.....


మరింత సమాచారం తెలుసుకోండి: