ధీరూభాయ్ అంబానీ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యం రిలయల్స్ ఇండస్ట్రీస్ అని చెప్పాలి.  రిలయన్స్ ఇండస్ట్రీస్ ను స్థాపించిన అంబానీ ఆ తరువాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ను దశదిశలా వ్యాపింపజేశారు. ధీరూభాయ్ అంబానీ అందించిన వ్యాపారాన్ని ముఖేష్ అంబానీ మరింతగా విస్తరించారు. అనేక రంగాల్లో పెట్టుబడులుగా పెట్టారు.  ఇప్పుడు ఇండియాలోనే టాప్ గా నిలిచారు.  ఒకప్పుడు టాటా ఎలాగైతే అన్నిరకాల వ్యాపారాల్లో తనదైన ముద్రను వేసుకుందో..రిలయన్స్ కూడా అదే విధంగా దూసుకుపోతున్నది.  


ఓటమి అన్నది అంబానీకి తెలియదు.  ఎందులో పెట్టుబడి పెట్టినా ఆ ఇండస్ట్రీ హిట్ అవుతున్నది.  క్రికెట్ ఫ్రాంచైసీలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఆర్జించారు.  సినిమా రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు.  ప్రపంచ కుబేరుల్లో అంబానీ 13 వ స్థానంలో నిలిచారు.  అయన నికర ఆస్తుల విలువ 51.1 బిలియన్ డాలర్లు.  అంటే దాదాపుగా 3.8 లక్షల డాలర్లు.  ఇంతసంపాదన సంపాదించాలంటే ఒక వ్యక్తికీ ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు.  


ముకేశ్ అంబానీ చమురు వ్యాపారంలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టారు.  ముఖ్య ఆదాయ వనరుకు కూడా అదే కావడం విశేషం.  ఇక ఇదిలా ఉంటె, అంబానీ అనే పేరుకు గూగుల్ ఏమని అర్ధం చెప్తున్నాడో తెలుసా.. ఐ హ్యావ్ మనీ అని చెప్తున్నది.  అంటే నాదగ్గర డబ్బు ఉంది అని.  నిజమే కదా అంబానీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది.  పెట్టుబడులు పెట్టేందుకు తెలివితేటలు ఉన్నాయి.  


కావాల్సినంత మంది స్టాఫ్ ఉన్నారు.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్నాడు.  అయన నివసిస్తున్న ఇంటి ఖరీదు నాలువేల కోట్ల రూపాయలు.  అందులో నివసించేది కేవలం ఆరుగురు మాత్రమే.  27 అంతస్తుల ఈ భవనంలో కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది.  ఇందులో 600 మంది పనివాళ్ళు ఉన్నారు. నెలకు రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.  ఎంత సంపాదన లేకుంటే అంతలా ఖర్చు చేస్తారు చెప్పండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: