ఆంధ్ర ప్రదేశ్  సీఎం జగన్ బాటలోనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దును తప్పు పట్టి రచ్చ చేసిన టీడీపీ మరియు బీజేపీకి ఒక పెద్ద  షాకింగ్ వార్త  ఇచ్చింది. జగన్ పీపీఏల రద్దు నిర్ణయంపై  స్వయంగా కేంద్రంలోని బీజేపీ ఆ పార్టీకే చెందిన ఇంధనశాఖ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తప్పుపట్టారు. ఇప్పుడు స్వయంగా బీజేపీ పాలిత యూపీ సీఎం ప్రైవేటు విద్యుత్ ఉత్పాదక సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలను రద్దు చేసి సంచలనం నెలకొల్పారు.


వారం రోజుల క్రితం  యూపీ సీఎం యోగి ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్ సంస్థలతో చేసుకున్న 650 మెగావాట్ల విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని అమలు కూడా చేశారు. 2017లో 650 మెగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ కోసం యూనిట్ కు 3.46 రూపాయల చొప్పున యూపీ ప్రభుత్వం కూడా ఒప్పందాలు కుదిర్చుకుంది. అయితే ఇప్పుడు అంతకంటే  తక్కువగా రూ.3.02కే విద్యుత్ అందజేస్తామని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ ముందుకు రావడం జరిగింది. దాంతో పీపీఏలకు యోగి ఆధిత్యనాథ్ సరే అన్నారు.


కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రస్తుతం జగన్ బాటలోనే యూపీ సీఎం యోగి అనే విషయం పెద్ద షాకే ఇచ్చారు. పీపీఏలను కనీసం ఆ కంపెనీలకు ముందస్తు సమాచారం కూడా  లేకుండా రద్దు చేయడం జరిగింది. స్వయంగా బీజేపీ పాలిత ముఖ్యమంత్రి పీపీఏలు రద్దు చేసినా ఈ కేంద్ర ఇంధన శాఖ మంత్రి నుంచి అలంటి స్పందన లేకపోవడం గమనార్హం.


ఆంధ్రలో ఇప్పటికే జగన్ పీపీఏల రద్దుపై చంద్రబాబు.. ఆయన అనుకూల మీడియా కూడా పెద్ద రాద్ధాంతం చేసింది అని అందరికి అర్థం అవుతుంది. ఇప్పుడు యూపీ సీఎం కూడా రద్దు చేయడంతో వారి నోళ్లకు మూతలు పడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: