తమిళనాడులో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీప పాంబారు జలాశయం సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్‌, స్నేహ, వినోద, నివేద ఆదివారం సాయంత్రం జలాశయం అందాలు చూసేందుకు వెళ్లారు. అక్కడి అందాలను చూస్తూ సెల్ఫీ తీసుకొందామని జలాశయం గట్టువరకు వెళ్లారు. 


సెల్ఫీ తీసుకోబోతు అదుపు తప్పి జలాశయంలో గట్టుపై నుంచి నీటిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు పలు విశాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నీటి ఉదృతి ఎక్కువగా ఉండడంతో నలుగురు వరదలో కొట్టుకుపోయారు. స్థానికులచే సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో మృతదేహాలను వెలికి తీశారు. 

                              

ఈ ఘటనతో ఒడ్డపట్టి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా ఈ ఫోన్లు వచ్చిన తర్వాత జరగ కూడని ఘటనలు అన్ని జరుగుతున్నాయి. ఒకరోజు టిక్ టాక్ వల్ల చనిపోతే.. మరో రోజు పబ్ జి వల్ల.. మరి కొన్ని సార్లు ఈ సెల్ఫీ పిచ్చితో యువత చనిపోతున్నారు. 

                              

ఎన్నిసార్లు ఇంట్లో వారు, వార్తలు రాసేవారు, టీవీలలో ఆఖరికి వారికీ ఇష్టమైన ఫోన్లలో చెప్పిన పెడచెవిన పెట్టేస్తుంది. పెద్ద వారు చెప్పిన విషయాలు ఏవి సీరియస్ గా యువత తీసుకోవడం లేదు. అందుకే ఈ ఘోరాతి ఘోరాలు అన్ని జరుగుతున్నాయి.

                              

మరింత సమాచారం తెలుసుకోండి: