రాజ్య సభ సభ్యురాలు వందన చవాన్ పని నిమత్తం పూణే నుండి ఢిల్లీ కి విమానంలో ప్రయాణిస్తూ వచ్చింది. అయితే, ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం ఒక ఆమ్లెట్ ఆర్డర్ చేసింది. ఇకపోతే ఆ ఆమ్లెట్ లో గుడ్డు యొక్క పెంకులు వచ్చాయట. దానిని గమనించిన వందన ఒక్కసారిగా కోపంతో ఆయా సంస్థ పై జరిమానా విధించింది. అది కాస్త వైరల్ అయింది..



అసలు విషయానికొస్తే.. రాజ్య సభ సభ్యురాలు వందనా కోడిగుడ్డు పెంకులు రావడాన్ని ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా తీవ్రంగా మండిపడింది. విమానంలో ఆహారాన్ని సరఫరా చేసిన క్యాటరింగ్ సంస్థపై ఊహించిన స్థాయిలో జరిమానా విధించింది. అంతేకాదండోయి.. విమానంలో నిర్వాణం కోసం చేసిన ఖర్చులు, విమానం మొత్తం సరఫరా చేసిన ఫుడ్ ఖర్చులు భరించాలని డిమాండ్ చేసింది. 


ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ లో నాణ్యత లేదని ఆమె తన ట్విట్టర్ ద్వారా  ఎయిర్ ఇండియా వ్యవస్థకు ఫిర్యాదు చేసింది. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎయిర్ ఇండియా వెంటనే ఆ క్యాటరింగ్ పై అధిక మొత్తంలో జరిమానాను విదించాము అని ఆయా సంస్థ అధినేత ధనుంజయ్ వెల్లడించారు. 


ఈ విషయం గురించి ఆమె మొన్న ఆమధ్య ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మూడు నాలుగు సార్లు కోడిగుడ్డు పెంకులు తగిలాయి. బంగాళాదుంప ముక్కలు పాడయ్యాయి. సోయాచిక్కుడు ఉడకనేలేదు. ఎయిర్‌ హోస్టెస్‌ దీనికి నేరుగా బాధ్యులు కారని అనుకుంటున్నాను అంటూ ఆమె వెల్లడించింది. ఇక ఈ విషయం పై ఎయిర్ ఇండియా సంస్థ చేసిన రిప్లై మెసేజ్ లను కూడా ఆమె ట్యాగ్ చేసి పోస్ట్ చేసింది కూడా. ప్రస్తుతం ఆ వార్త వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: