కొందరు ఎందుకు ప్రేమిస్తున్నారో తెలియదు. వారిప్రేమలో ఉన్న నిజాయితీ ఎంతనో తెలియదు.కాని పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నామని ఫోజులు కొడుతుంటారు.అవసరం తీరాక ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలవ్వుతాయి. ఆ అవసరం అనేది శారీరకంగా, గాని ఆర్ధికంగా కాని ఉండవచ్చూ. ఇంకొందరు ప్రేమించి పెళ్లిచేసుకున్నాక కూడా ఒకరినొకరిపై నమ్మకంగా జీవించలేరు. ఇప్పుడున్న ప్రేమజంటలు ఏక్షణం ప్రేమగా ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో అర్ధం కాని పరిస్దితిలో ప్రేమించుకుంటున్నారు.


ఇక ఇప్పుడున్న చాలా ప్రేమలు ఆకర్షణవల్ల పుడుతున్నాయే గాని నిజమైన ప్రేమవల్ల కాదు. ఇక ప్రేమించుకున్న వారు ఎప్పుడు తనను తన ప్రియురాలు,లేదా ప్రియుడు మోసం చేస్తాడో అంటూ  ఆలోచిస్తూ బ్రతవలసి వస్తుంది. అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా అన్నట్లుగా. ఇక ప్రేమించినవారు వేరే వ్యక్తితో మాట్లాడితే చాలు కొందరు నానా గోల చేస్తారు..ఇప్పుడొక ఘటన ఇలానే జరిగింది తను ప్రేమించిన వాడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో ఓ ప్రియురాలు ఎంత పనిచేసిందంటే వారున్న ప్రదేశం ఓ పార్క్ అనే విషయం కూడా మరచింది. ప్రియుని మీద కుక్కలా ఎగబడి అతన్ని రక్కేసింది.


ఈ రాక్షస ఘటన ఎక్కడ జరిగిందంటే అమెరికాలో ఓ పార్క్‌లో జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుంటే ప్రియుడు తనను మోసం చేస్తున్నాడేమోనని ప్రియున్ని గాఢంగా ప్రేమించే ఓ యువతికి అనుమానం వచ్చింది.  దాన్ని తొలగించుకోవాలని గట్టిగా నిర్ణయించుకొని, ఉదయాన్నే అతన్ని ఓ పార్కులో కలిసి అతని ఫోన్‌లో వివరాలు చూడటానికి ప్రయత్నించింది. అయితే అతని ఫోన్ ఫేస్‌లాక్ చేసుంది.


ఆ లాక్ తీయమని గోముగా అడిగిన ఆ ప్రియుడు, ససేమిరా అనడంతో క్షణంలో ఆమె భద్రకాళిలా మారి, బలవంతంగా ఆ లాక్ తీయడానికి ప్రయత్నిస్తూ, ఫోన్‌కు అతని మొహం చూపించబోయింది. కానీ ఆ ప్రియుడు తన మొహం ఫోన్ ముందుకు తీసుకు రాకుండా తప్పించుకున్నాడు. దీంతో చిర్రెత్తిన ఆమె.. అతన్ని కిందపడేసి బలవంతంగా ఫోన్ లాక్ తీసింది. ఆ వెంటనే ఫోన్ తీసుకొని పారిపోయింది. అమెరికాలో జరిగిని ఈ ఘటనను ఆ పార్కులోనే ఉన్న ఓ వ్యక్తి వీడియోతీశారు. ప్రస్తుతం ఈ ఘటన తాలుకు దృష్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన క్షణాల్లోనే  వైరలయింది.అది చూసిన నెటిజన్లు ఊరికే ఊరుకుంటారా తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ, ఈ ప్రేమజంటను ఆడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: