కార్మికుల సమ్మెను అడ్డుపెట్టుకుని ప్రజారవాణాలో కీలక పాత్ర వహిస్తున్న ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఇందుకు ఆయన తాజాగా వెలిబుచ్చిన ప్రైవేటీకరణ ప్రణాళికే కారణం.. ఆర్టీసీ కార్మికులపై గుర్రుగా ఉన్న కేసీఆర్ ఇదే అదనుగా ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్నారు.


ఆయన కార్యాలయం వెల్లడించిన ప్రెస్ నోట్ లో ఈ ప్లాన్ చాలా క్లియర్ గా వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,400 బస్సులున్నాయి. వీటిని భవిష్యత్ లొ మూడు రకాలుగా విభజించి నడపాలట. 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీకి చెందినవై, ఆర్టీసీ యాజమాన్యంలోనే వుంటాయి. 30% బస్సులు, అంటే 3100 బస్సులు అద్దె రూపేణా తీసుకుని వాటిని కూడా పూర్తిగా ఆర్టీసీ పర్యవేక్షణలోనే, ఆర్టీసీ పాలన కిందే నడపడం జరుగుతుంది. వాటిని వుంచడం కూడా ఆర్టీసీ డిపోలలోనే. మరో 20% బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రయివేటువి, ప్రయివేట్ స్టేజ్ కారేజ్ విగా అనుమతి ఇస్తారు.


ఈ బస్సులు పల్లెవెలుగు సర్వీసు కూడా నడపాలి. అద్దెకు తీసుకున్న బస్సులు, స్టేజ్ కారేజ్ బస్సులు ఇతర రూట్లతో పాటు నగరంలొ కూడా నడపాలి. ఆర్టీసీ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు సమానంగా, ఆర్టీసీ నియంత్రణలోనే వుంటాయి. వాళ్ల చార్జీలు కూడా ఆర్టీసీ పెంచినప్పుడే పెంచడం జరగాలి. స్వల్పంగా పెంచడానికి కూడా ఆర్టీసీ కమిటీ నిర్ణయం మేరకు అవసరం అని భావించినప్పుడు చేయాలి.


ఇప్పటికీ 21% అద్దెబస్సులను ఆర్టీసీ నడుపున్నది. అంటే, ఇక అద్దెకు తీసుకోవాల్సింది అదనంగా మరో 9% మాత్రమే. అదనంగా 9% అద్దె బస్సులను పెంచడం అంటే ఆర్టీసీకి కొత్త బస్సులు వచ్చినట్లే అంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే ఆర్టీసీని క్రమంగా ప్రైవేటు చేతుల్లో పెట్టేస్తామని చెప్పకనే చెబుతున్నారన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: