టీవీ 9 రవిప్రకాష్ గా అందరికీ సుపరిచితమైన ఈ మీడియా టైకూన్ ఈ రంగాన్ని ఆసరాగా చేసుకుని బాగానే ఎదిగారు. ప్రింటి మీడియాలో అధునిక పోకడలకు పితామహునిగా ఈనాడు రామోజీరావుని  చెప్పుకుంటారు. ఆయన కొత్త రకాన్ని చూపించి రీడర్లను ఆకట్టుకున్నారు. సర్క్యులేషన్ని లక్షలకు పరుగులెత్తించారు. ఇక న్యూస్ పరంగా కూడా అనేక మార్పులు చేర్పులు తెచ్చారు. అదే విధంగా రవిప్రకాష్ గురించి చెప్పుకోవాలంటే ఆయన కూడా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సరికొత్త విప్లవాన్ని తెచ్చారు.


టివీల్లో వార్తలు నిర్ణీత సమయంలోనే ప్రసారం కావడం వినడం, చూడడం అలవాటు అయిన జనాలకు ఇరవై నాలుగు గంటల పాటు వార్తలు ప్రవాహంగా ప్రసారం చేసి అందులో సక్సెస్ మంత్రాన్ని కనుగొన్నారు. అయితే రవిప్రకాష్ కు  పేరుతో పాటు అవినీతి ఆరోపణలు ఇటీవల కాలంలో వెల్లువెత్తాయి. ఫలితంగా ఆయన టీవీ 9 నుంచి బయటకు వచ్చేశారు. ఆ తరువాత ఆయన తాజాగా అరెస్ట్ కూడా అయ్యారు.


ఇపుడు రవిప్రకాష్ పై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్ని ఆధారాలతో ఏకంగా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనం రేకెత్తించింది. రవి ప్రకాష్ అవినీతి సామ్రాజ్యాన్ని గురించి విజయసాయిరెడ్డి ఆధరాలతో సహా అందించారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యులేషన్స్, మనీ లాండరింగ్ తో  పాటు, ఇన్ కమ్ టాక్స్ ని ఎగ్గొట్టారని కూడా ఆరోపించారు. మెయిన్ ఖురేషీ, సానా సతీష్తో కలసి చాలా మందిని మోసం చేశారని అన్నారు. ఇటు కెన్యా, ఉగాండాల్లోని సిటీ కేబుళ్ళలో రవి ప్రకాష్ పెట్టుబడులు చాలా ఉన్నాయని విజయసాయిరెడ్డి తెలియచేశారు. మరి దీని మీద సుప్రీం కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏమైనా లేఖ బాగానే దట్టించారు విజయసాయిరెడ్డి.




మరింత సమాచారం తెలుసుకోండి: