ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే  తన ప్రభుత్వ లక్యంగా   జగన్‌ ముందుకు వెళ్తున్నాడు. అందుకే  అ‍త్యంత పారదర్శకంగా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.  కానీ మళ్లీ ఎలాగైనా సీఎం అవ్వాలనే అత్యాశతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. అయినా జగన్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.  ఇప్పటివరకూ 40 లక్షలమంది రైతులను అర్హులగా  జగన్ ప్రభుత్వం గుర్తించింది.  ఇంకా అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.  అదే బాబు ప్రభుత్వం గతంలో  పీఎం కిసాన్‌ యోజన పథకంలో భారీగా అనర్హులకు ఇచ్చారు. ఆర్టీజీఎస్‌ ద్వారా అమలు చేసిన పథకం జాబితాలో లక్షల్లో అనర్హులు ఉన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వారిని తొలగిస్తున్నారట.  అలాగే ఇన్‌కం ట్యాక్స్‌  కట్టేవాళ్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులను జాబితా నుంచి తొలగిస్తున్నారు.  ఇక కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు.  ఇక గిరిజన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం అని జగన్ చెబుతున్నారు.  

మొత్తానికి  చంద్రబాబు నాయుడు అప్పులతో రాష్ట్రాన్ని అప్పచెప్పినా  జగన్‌మోహన్‌రెడ్డి సమర్థవంతంగా హామీలు నెరవేరుస్తున్నాడు.  మహిళల విషయానికే వద్దాం  ఓట్లుతో సంబంధం లేకుండా  రిజర్వేషన్లలో మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైస్ జగన్‌ ప్రభుత్వమే.. ఇది కాదనలేని నిజం.  ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని.. స్వయం సహాయక సంఘాలు బలోపేతం కావాలని జగన్ ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు చేస్తున్నాడు. మరి బాబు ఏమి చేశాడు ?  గత ఎన్నికల్లో ఓట్లు దండుకోనేందుకు పసుపు-కుంకుమ పేరుతో  మహిళలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ  చివరికీ వాళ్లే బాబును మోసం చేశారనుకోండి.  వాళ్ళు అలా మోసం చేయడానికి ప్రధాన కారణం  బాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని  మాటలు చెప్పి.. కాలం వెళ్లబుచ్చాడు.  కానీ  వైఎస్‌ జగన్‌  ఇచ్చిన మాట ప్రకారం నాలుగు దశల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.  ఆ రోజుల్లో మహానుభావుడు ఎన్టీఆర్ పాలనలో  ఆ తరువాత మహానేత వైఎస్సార్‌ హయాంలో..  నేడు  జగన్‌ పరిపాలనలో సామాన్య ప్రజలకు పూర్తి న్యాయం జరుగుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఏమైనా జగన్  అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: