తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెకు దిగిన కార్మికులను, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాలకు తీసుకోమని చెప్పి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ దాదాపుగా 48 వేల మందికి పైగా ఉద్యోగులను పరోక్షంగా తొలగిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరి కేసీఆర్ వేల సంఖ్యలో ఉద్యోగులను ఒకేసారి తొలగించవచ్చా..? ఇన్ని వేల మంది ఉద్యోగులను తొలగిస్తే చట్టాలు ఏం చెబుతున్నాయనే విషయాలను పరిశీలిస్తే మాత్రం ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను తొలగించటం సరికాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అత్యవసర సేవల నిర్వహణ చట్టం ప్రకారం ఆర్టీసీ కార్మికుల తొలగింపు చట్టబద్ధమే అయినప్పటికీ కోర్టులో ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఉపశమనం లభించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. గతంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అధికారంలో ఉన్న సమయంలో సమ్మె చేసిన ఉద్యోగులను 1.70 లక్షల మందిని ఎస్మా చట్టం ప్రకారం తొలగించింది. 
 
ఆ తరువాత ఉద్యోగులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేఖంగా కోర్టును ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ప్రభుత్వానికి ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఉద్యోగులకు భవిష్యత్తులో సమ్మెలు చేయమని ప్రమాణ పత్రం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
గతంలో తమిళనాడులో తీర్పు ఉద్యోగులకు అనుకూలంగా రావటంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కూడా కోర్టుకు వెళితే కార్మికులు, ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పు ఉద్యోగులకు అనుకూలంగా వస్తే మాత్రం కేసీఆర్ తొలగించిన ఉద్యోగులను మరలా ఉద్యోగాలలోకి తీసుకోక తప్పదు. న్యాయ నిపుణులు మాత్రం వేల సంఖ్యలో ఉద్యోగులు న్యాయపోరాటం చేస్తే మాత్రం కేసీఆర్ కు షాక్ తప్పదని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: