ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య నిత్యం రగడ జరుగుతూనే ఉన్నది.  ఇండియాలోకి ఉగ్రవాదులను జొప్పించి అలజడులు సృష్టించాలని పాక్ చూస్తున్నది.  అందుకు అనుగుణంగా ఉగ్రవాదులను ప్రేరేపిస్తోంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ప్రజలను రెచ్చగొడుతున్నాడు.  ప్రజలను పీవోకే ప్రజలను లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరకు వెళ్లి అక్కడ ఆందోళన చేసే విధంగా ప్రోత్సహిస్తోంది.  


ఇలా ఆందోళనను రెచ్చగొట్టి.. కాశ్మీర్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నది పాకిస్తాన్.  ఇమ్రాన్ ఖాన్ తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు చెత్తగా ఉంటున్నాయని ఇప్పటికే అంతర్జాతీయ దేశాలు పేర్కొంటున్నాయి.  ఒక దేశ ప్రధాని తీసుకునే నిర్ణయాలు ఆ దేశానికీ ఉపయోగపడే విధంగా ఉండాలిగాని, ఆవేశానికి పోయి నిర్ణయాలు తీసుకుంటే.. ఫలితంగా దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది.  ఇవేమి ఇమ్రాన్ ఖాన్ కు పట్టడంలేదు.  


ఆయనకు కావాల్సింది ప్రజలను రెచ్చగొట్టడం.. కాశ్మీర్లోఅలజడులు సృష్టించడం.. ఇదే అజెండాగా ఉన్నది.  పాక్ మిత్రదేశాలు సైతం పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాయి.  గతంలో ముషారఫ్ ఉన్నప్పుడు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేశాన్ని నిండా ముంచాడో ఇమ్రాన్ కూడా అలానే చేస్తున్నాడు.  నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు ముషారఫ్ జనరల్ గా ఉన్నారు.  పాక్ ప్రధాని ఇప్పుడు బొమ్మే అని, అధికారం అంతా సైన్యం చేతుల్లోనే ఉంటుందని తెలిసిందే.  


దానికి అనుగుణంగానే జనరల్ ముషారఫ్ ప్రధానికి తెలియకుండానే కార్గిల్ లోని టైగర్ హిల్స్ ను ఆక్రమించుకున్నారు.  వెంటనే ఇండియా స్పందించడంతో.. రెండు నెలల పటు యుద్ధం జరిగింది.  అనంతరం పాకిస్తాన్ తోకముడిచింది.  ఆ తరువాత ముషారఫ్.. ప్రధాని నవాజ్ షరీఫ్ ను దించేసి ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు.  అధ్యక్షుడిగా ప్రకటించరుకున్నారు.  ఆ తరువాత కొన్నాళ్ళకు అగ్రరాజ్యాల ఒత్తిళ్ల కారణంగా దిగిపోయి పార్టీని స్థాపించారు.  ఆ తరువాత ఓడిపోయారు.  ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముషారఫ్ తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.  కాశ్మీర్ పై అయన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ రక్తంలోనే కాశ్మీర్ ఉందని, తమ దేశం తమ ప్రజలు ఏమైనా సరే కాశ్మీర్ ప్రజల కోసం పోరాటం చేస్తామని ముషారఫ్ పేర్కొన్నాడు.  అవసరమైతే ఇండియాపై యుద్ధం చేయడానికి కూడా సైన్యం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.  పాక్ యుద్ధమే కోరుకుంటే అందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఇండియా పేర్కొన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: