గత నాలుగు రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మె కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.  పండుగ సీజన్లోనే ఆర్టీసీ ఆదాయం వస్తుంది.  అంతేకాదు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన.. ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తే ఆ తరువాత ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతారనే నమ్మకం లేదు.  అందుకే పండుగ సమయంలో సమ్మె చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం ఉక్కపాదం మోపింది.  


ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లిస్తున్నామని, అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నామని కానీ,ఇంకా గొంతెమ్మ కోరికకు తీర్చమని అంటే ఎలా కుదురుతుందని కెసిఆర్ అంటున్నారు.  ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేది లేదని, ఆర్టీసీలో మార్పులు తీసుకొచ్చే పనిలో ఉన్నామని, త్వరలోనే ఆర్టీసీ లాభాల బాట పడుతుందని కెసిఆర్ పేర్కొన్నారు.  


ఆర్టీసీ లాభాల బాట పట్టాలి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నారు.  ఒకవేళ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కోరిన కోరికలు తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు వస్తే.. రేపు రెవిన్యూ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు కూడా సమ్మెకు దిగుతారని, ఫలితంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని కెసిఆర్ అభిప్రాయం.  అసలే రెవిన్యూ ఉద్యోగులు ప్రభుత్వంపై సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.  


ప్రభుత్వం చెప్పినట్టుగా ఉద్యోగులు నడుచుకోవాలిగాని, ఉద్యోగులు చెప్పినట్టుగా ప్రభుత్వం నడుచుకోవడం కాదని కెసిఆర్ అభిప్రాయం.  ఆంధ్రప్రదేశ్ లో జగన్ హామీ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వంలో విలీనం చేశారు.  తెలంగాణలో అలాంటి హామీ ఇవ్వలేదని, ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశం లేదని స్పష్టం చేసారు కెసిఆర్ గారు.  అంతేకాదు, ఆర్టీసీ సమ్మెకు దిగిన ఉద్యోగులను ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తింపబడరని, యూనియన్లు కూడా ఉండవని ఇప్పటికే స్పష్టం చేశారు.  కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చుకొని తీరతామని అంటున్నారు.  తెలంగాణాలో ఏం జరగబోతుందో తెలియాలంటే పండుగ అయిపోయే వరకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: