ఈనెల 21 వ తేదీన హుజూర్ నగర్ కు ఉపఎన్నిక జరగబోతున్నది.  ఈ ఉపఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తెరాస పార్టీ కృషి చేస్తున్నది.  క్యాడర్ మొత్తం హుజూర్ నగర్లోని తిష్ట వేసింది.  అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, నేతలు అంతా హుజూర్ నగర్లోని తిష్ట వేశారు.  హుజూర్ నగర్లో అభివృద్ధి సాధించాలనంటే తప్పకుండా తెరాస పార్టీ విజయం సాధించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 

అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.  అన్ని పార్టీలు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.  అయితే, హుజూర్ నగర్లో కొంతమంది సర్పంచులు కలిసి నామినేషన్లు దాఖలు చేశారు.  ఇది తెరాస పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే.  నిజామాబాద్ లో కవిత ఓటమికి అక్కడి రైతులు వేసిన నామినేషన్లు ఒక కారణం.  అంతేకాదు, గత ఎన్నికల్లో కొంతమందికి ఈసీ ట్రాక్టర్ గుర్తును కేటాయించింది. 


ఈ గుర్తు కారణంగా కొన్ని చోట్ల తెరాస పార్టీ ఓటమి పాలైందట.  అందుకే ఈసారి ట్రాక్టర్ గుర్తును కేటాయించవద్దని ఈసీని కోరింది.  ఈసీ అందుకు సరే అని చెప్పినట్టు తెలుస్తోంది.  కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమందికి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారు.  పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కొన్ని చోట్ల పరాజయం పలవడానికి రోడ్డు రోలర్ కారణం అయ్యి ఉంటుందని తెరాస పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది.  


కాగా, ఇప్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తు దర్శనం ఇస్తోంది.  ఇదే ఇప్పుడు ఆ తెరాస పార్టీని కలవరపెడుతున్నది.  హుజూర్ నగర్లో ఎన్నిక పోటాపోటీగా జరిగితే.. ఈ రోడ్డు రోలర్ గుర్తు కారణంగా పార్టీకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది.  అందుకే  కార్యకర్తలకు గుర్తుపై అవగాహనా కల్పిస్తున్నారట. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ హుజూర్ నగర్ ఎన్నికపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి.  తెరాస పార్టీని ఓడిస్తామని అన్ని పార్టీలు చెప్తున్నాయి.  ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే విషయాలు తెలియాలంటే అక్టోబర్ 24 వరకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: