Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 13, 2019 | Last Updated 10:36 am IST

Menu &Sections

Search

కోర్టుల్లో కేసీఆర్ నియంతృత్వానికి - రానున్న ఎన్నికల్లో అధికారానికి చరమగీతం తప్పదా?

కోర్టుల్లో కేసీఆర్ నియంతృత్వానికి - రానున్న ఎన్నికల్లో అధికారానికి చరమగీతం తప్పదా?
కోర్టుల్లో కేసీఆర్ నియంతృత్వానికి - రానున్న ఎన్నికల్లో అధికారానికి చరమగీతం తప్పదా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బంగారు తెలంగాణా సంగతెలా ఉన్నా రాష్ట్రంలో బాంగారు కుటుంబానికి ఢోకా లేదని, కేసీఆర్ రాచరికాన్ని జ్ఞప్తికి తెచ్చే నియంతృత్వానికి అడ్డేలేదని ఇప్పుడు తెలంగాణా ప్రజలు బహిరంగగానే అంటున్నారు. నగరం తగలబడుతున్నా ఎవడో రాజు ఫిడేల్ వాయిస్తూ కాలయాపన చేసినట్లు - మన కేసీయార్ కూడా ₹150 కోట్ల ప్రజాధనంతో అతి విలాసవంతంగా రాజమహలు ని తలపించే ప్రగతి భవన్ లో కూర్చొని లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలతో ఇంటర్మీడియట్ బోర్డ్ చెలగాటమాడినా, పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నా, చలనం కూడా ప్రదర్శించ లేదనేది తెలంగాణా ప్రజలలో వెల్లువెత్తుతున్న వ్యతిరెఖత సుస్పష్టం.

దాదాపు అరలక్ష మంది ఆర్టీసి ఉద్యోగుల జీవితాలతో ఇప్పుడు చెలగాటమాడటం మొదలెట్టారనేది రోజూ చూస్తున్న కథే. సమ్మెగా నడుస్తున్న వారి పోరాటం ఉద్యమాన్ని తలపిస్తున్న వేళ ఆయన వినోదిస్తున్నారా? "పిల్లికి మాత్రం చెలగాటం కాని ఎలుకకు ప్రాణ సంకటం" అన్నది ఈ రూపేణా ఋజువౌతుంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోబోమని చెప్పి వారందరికి ఝలక్ ఇచ్చిన విషయం జనం, జగం ఎరిగిందే. దాదాపుగా ఒక అరలక్ష మంది ఉద్యోగులను అన్యాపదేశం ఏం ఖర్మ ప్రత్యక్షంగానే తొలగిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం విదితమే. విజయ దశమి వేళ ఏభై వేల కుటుంబాల్లో తిమిరం ముసురుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రకటన కేసీఆర్ నుండి వెలువడక ముందు సమ్మెలో చేరిన ఆర్టీసీ ఉద్యోగులపై పండుగ సమయాన సమ్మేమిటి? అంటూ వారి భాధ్యతారాహిత్యాన్ని దూషించిన ప్రజలు - తెగే దాకా గుంజు తున్న కేసీఆర్ అహంభావాన్ని, దురహంకారాన్ని ప్రశ్నిస్తూ ఆగ్రహోదగ్దులౌతున్నారు. తన దురహంకార ప్రకటన అనే స్వయంకృతాపరాధం కేసీఅర్ పుట్టి ముంచబోతుందా? అనే అనుమానాలు పొడచూపుతున్నాయి.  

వేల సంఖ్యలో ఉద్యోగులను ఒకేసారి తొలగించటం చట్టపరం సాధ్యమా? ఇన్ని వేలమంది ఉద్యోగులను తొలగిస్తే "నిరుద్యోగిత" అమాంతగా పెరగదా? అసలే "ఆర్ధిక మాంద్యం"  ముప్పిరు గొంటున్న వేళ,  కొత్త నిరుద్యోగం ఇంకా మాంద్యాన్ని ముందుకు తోయటం తప్పదనే సూచనలు వస్తున్నాయి. చట్టాలు ఏం చెబుతున్నాయనే విషయాలను పరిశీలించ ముందే పరిస్థితులను అవగాహన చేసుకోక పోవటం కేసీఆర్ దురహంకారానికి గొడ్డలి పెట్టవటం ఖాయం అని అంటున్నారు. ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
అయితే ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులను, ఉద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించటం పద్దతి కాదని న్యాయనిపుణుల వాదన. అయితే చట్ట ప్రకారం ముందే నోటీస్ ఇచ్చిన ఆర్టీసి ఉద్యోగులపై - 'అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా' ప్రయోగించి వారిని ఉద్యోగాల నుండి తొలగించటం ధర్మమా? కొంతసేపు న్యాయం, చట్టం ప్రక్కన పెట్టి ఆలోచిస్తే - కేసీఆర్ ముదిరె దాకా ఈ సమస్యపై ఎందుకు స్పందించ లేదు? ఏభైవేల మంది సమస్యను నిర్లక్ష్యం చేయటంలోని దురుద్దేశం ఏమిటి? చట్టబద్ధమే అయినా ఇంతమందిని సమస్యల పాల్జెసే నిర్ణయం హర్షణీయమా? ఇప్పుడు తెలంగాణా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.

కోర్టులో ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఉపశమనం లభించే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంది. తమిళనాడు రాష్ట్రంలో, ఇలాగే దివంగత జయలలిత ముఖ్యమంత్రిత్వం నెరుపుతున్న వేళ ఉధృతంగా సమ్మెలో పాల్గొన్న ఒక లక్షా డెబ్బై వేల మంది ఉద్యోగులపై ఎస్మా చట్టం అనే ఆయుధం ప్రయోగించి ఉద్యోగాల నుండి తొలగించింది. 
 
అయితే ప్రభుత్వ నిర్ణయంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఉద్యోగుల వాదనను పరిశీలించిన న్యాయస్థానం తీర్పును నిర్ద్వంధంగా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చి తక్షణమే ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటమే జారీ చేసింది. అంతేకాదు ఉద్యోగులు భవిష్యత్తులో ఇలా సమ్మెలు చేయమని "ప్రమాణ పత్రం" ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇది చాలు- ఇప్పుడు ఆర్టీసి ఉద్యోగులు తమిళనాడు ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన సుపీం తీర్పును ఉదహరిస్తే చాలు టిఎస్-ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు కూడా  అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. న్యాయ నిపుణుల ప్రకారం వేల సంఖ్యలో ఉద్యోగులు పూనుకొని న్యాయ పోరాటంచేస్తే మాత్రం కేసీఆర్ కు తీరని వేదన మిగులుతుందని - ఆ షాక్ మామూలు గా ఉండని తెలుస్తుంది. అప్పుడు న్యాయస్థానం తీర్పు ఉద్యోగులకు అనుకూలంగా వస్తే మాత్రం కేసీఆర్ తొలగించిన ఉద్యోగులను ఉద్యోగాలలోకి తీసుకోకతప్పదు పరువు ప్రతిష్ఠ కోల్పోక తప్పదని న్యాయనిపుణుల వాదన. 

తాను సచివాలయానికి రాకుండా - ఉద్యోగులను అదీ వారి డిమాండ్స్ కోసం పోరాడే వారిని (ఆర్టీసీ ఉద్యోగులను) పనిలో చేరమని కేసీఆర్ ఆదేశించటంలోని ఔచిత్యాన్ని సమ్మె లో పాల్గొంటున్న ఉద్యోగులు తీవ్రస్వరంతో ప్రశ్నిస్తున్నారు.

అసలే కొన్ని వేల మంది ఇంటర్మీడియట్ విద్యార్ధుల కుటుంబాల ఆత్మఘోష - ఇప్పుడు అరలక్ష ఆర్టీసి ఉద్యోగుల కుటుంబాల వ్యధ - కలసి రానున్న ఎన్నికల్లో కేసీఆర్, బంగారు కుటుంబ అధికారానికి చరమగీతం పాడనున్నాయా? అనేది ఏపిలో చంద్రబాబు పాలనకు పాడిన చరమ గీతాన్ని స్పురింప జేస్తుందని జనాభిప్రాయం. బిందువు బిందువు కలసి సింధువు అయినట్లు ఒక్కో వర్గ అసంతృప్తి ఉద్యమంగా మారి ఓట్లుగా మారటం ఖాయమని చెప్పవచ్చు.  


End Card to KCR dictatorship ?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ?
“శ్రీ రాముడిని వదిలేసినా! శ్రీ రాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
వజ్రం లోపల మరో వజ్రం - ప్రపంచ అద్భుతం
పొరుగు దేశాలు - పాక్, చైనా - రెండింటికి భారత్ తీవ్ర హెచ్చరిక
అన్నీ మంచి శకునములే: మందగమనం ఉన్నా భవిష్యత్ ఆశాజనకం: ఐటీసి
జగన్ పై ప్రతిపక్షాల పొగడ్తల వరద - హుజూర్నగర్ ఉపఎన్నిక మద్దతులో టీఅరెస్ కు సీపీఐ ఝలక్?
జస్టిస్ చంద్రకుమార్ సంచలనం: కేసీఆర్ ది నోరా? మోరీనా?
కేంద్రం సంచలన నిర్ణయం: ఒక్కో కుటుంబానికి ₹5.50 లక్షలు ప్రయోజనం
"ఐదు ట్రిలియన్ డాలర్ ఏకానమి" గా భారత్ - వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో వక్తలు
ఆర్ధిక సంక్షోభానికి ఇదేమైనా దారితీస్తుందా?
రాజ్ నాధ్ ఆయుధ పూజ - రఫేల్ గగన విహారం - పాక్ గుండెల్లో రైళ్ల పరుగులు
పాక్ మాయలమారి టక్కుటమారి అని మరోసారి ప్రపంచానికి ఋజువు చేసిన భారత యుద్ధవిమానాల గగన విహారం
తెలంగాణాలో టిఎస్ ఆర్టీసి ఉద్యోగుల సమ్మెని నిర్లక్ష్యం చేస్తున్న మీడియా!
కోర్టుల్లో కేసీఆర్ నియంతృత్వానికి - రానున్న ఎన్నికల్లో అధికారానికి చరమగీతం తప్పదా?
About the author