ఒక జర్నలిస్టు ఇన్ని ఆస్తులు సంపాదించాడంటే వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. మధ్య తరగతికి చెందిన ఒ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ వరకూ కూడా సొంతానికి ఇల్లు కట్టుకోవాలంటే కష్టంగా ఉన్న రోజుల్లో ఓ జర్నలిస్టు ఏకంగా వందల కోట్ల రూపాయల ఆస్తిని ఎలా సంపాదించాడు ? రాజకీయ నేతలో లేకపోతే బడా వ్యాపారస్తులో వందల కోట్లు ఆస్తులు సంపాదించారని అంటే అర్ధముంది.

 

ఓ జర్నలిస్టు అందులోను మెరుగైన సమాజం కోసం నిరంతరం తపించే రవిప్రకాశ్ కు వందల కోట్లు ఆస్తులున్నాయని ఆరోపణలు వినబడుతున్నాయంటే విచిత్రంగానే ఉంది. నికార్సైన జర్నలిజంతోనే ఇవన్నీ సంపాదించారా ? ఇప్పుడిదంతా ఎందుకంటే రవిప్రకాష్ ఆస్తులు, వ్యాపారాల చిట్టా గురించి వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు.

 

విజయసాయి లేఖ చదివిన వాళ్ళకు రవిప్రకాశ్ అక్రమాస్తుల చిట్టా చదువుతుంటే కళ్ళ తిరగకమానవు. మీడియా సంస్ధల్లో ఏ స్ధాయిలో పని చేస్తున్న వాళ్ళకైనా వందల కోట్ల ఆస్తులు సంపాదించటం జరిగే పనికాదు. కేవలం అడ్డదారులు తొక్కితేనే, రాజకీయ నేతలతో అక్రమ సంబంధాలుంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయని చెప్పక్కర్లేదు.

 

విజయసాయి లేఖ ప్రకారం రవిప్రకాష్ కు జాబింయా, కెన్యాలో భారీ ఎత్తున వ్యాపారాలున్నాయి. మీడియా రంగంలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. పెట్టుబడులన్నీ తన పేరు మీదే కాకుండా భార్య దేవిక పేరు మీద కూడా పెట్టారట.

 

వైసిపి ఎంపి ఆరోపణల ప్రకారం రవిప్రకాష్ మనీల్యాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన తదితరాలకు పాల్పడ్డారట. ఉగాండాలో ఓ కొర్పొరేట్ ఖాతా కూడా ఉందట. ఒక దశాబ్దంగా రవిప్రకాశ్ వ్యవహారశైలిపై అనేక ఆరోపణలున్నాయి. రాజకీయ నేతలతో పాటు ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించటం లాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

 

తన మాట వినని వారిని రవిప్రకాష్ నానా రకాలుగా వేధించేవాడనే ఆరోపణలకైతే కొదవే లేదు. మరి ఇన్ని ఆరోపల మీద పోలీసులు రవిప్రకాష్ ను అరెస్టు చేశారు. తాజాగా విజయసాయి ఏకంగా సుప్రింకోర్టు సీజేకే లేఖ రాయటమంటే మామూలు విషయం కాదు. మరి ప్రధాన న్యాయమూరి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: