జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంకా డబుల్ గేమ్ కంటిన్యు చేస్తూనేఉన్నారు. తెలంగాణాలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు అనుకూలంగా మాట్లాడారు పవన్ . కార్మికుల సమ్మె విషయంలో కెసియార్ వ్యవహారశైలిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

 

మరి ఏపి విషయానికొచ్చేసరికి పవన్ నోరు ఎందుకని పడిపోయింది ? దశాబ్దాల డిమాండ్ ను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే జగన్మోహన్ రెడ్డి పరిష్కరించిన విషయం పవన్ కు కనబడలేదా ? ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది దశాబ్దాల డిమాండ్. సంస్ధను విలీనం చేయటంలో సాంకేతిక సమస్యలున్న కారణంగా ఉద్యోగులను విలీనం చేసేశారు.

 

అదే సమయంలో ఆర్టీసిలోని 52 వేలమంది ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 ఏళ్ళ నుండి 60కి పెంచుతు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నిజంగా ఆర్టీసి విషయం తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమనే చెప్పాలి.  జగన్ నిర్ణయంతో వేలాది మంది కార్మికులకు లబ్ది జరిగిందన్నది వాస్తవం.

 

మరి ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని పవన్ ఎందుకని మెచ్చుకోలేదు ? మంచి ఎవరు చేసినా వాళ్ళకు తన సంపూర్ణ మద్దతుంటుందని ఎన్నో బహిరంగసభల్లో చెప్పిందంతా అబద్ధమేనా ? లేకపోతే చంద్రబాబునాయుడుకు భయపడి నోరెత్తలేకపోయారా ? అంతకుముందు కడ్నీ బాధితుల కోసం  శ్రీకాకుళం జిల్లాలో  ఏకంగా ఓ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి శంకుస్ధాపన చేసినపుడు కూడా పనవ్ కనీసం జగన్ ను మెచ్చుకుంటూ ఓ ప్రకటన కూడా చేయలేదు.

 

అలాంటిది ఇపుడు మాత్రం జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని వెంటనే జగన్ కు ముడిపెట్టేసి రెచ్చిపోతుండటమే విచిత్రంగా ఉంది. చూస్తుంటే జగన్ విషయంలో చంద్రబాబు, పవన్ వైఖరి కూడబలుక్కునే ముందుకు పోతున్నట్లుంది. చంద్రబాబు నీడలో నుండి  బయటపడనంత వరకూ రాజకీయంగా పవన్ కు ఎటువంటి ఎదుగుదల ఉండదని తెలుసుకోకపోతే తన అన్నయ్య చిరంజీవి లాగే అయిపోతారు చివరకు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: