ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఆర్టీసీ సంస్థ ఉండి తీరాల్సిందేనన్నారు తెలంగాణ సీఎం కెసిఆర్. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆర్టీసీకి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి సమరి్పంచింది. ఈ ప్రతిపాదనలపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కూలంకషంగా చర్చించారు.


ఆర్టీసీలో తాజా చర్యలన్నీ చేపట్టడానికి ప్రధాన కారణం యూనియన్ల అతిప్రవర్తనే కారణమని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.  గత 40 ఏళ్లుగా జరుగుతున్న దాష్టీకం వల్ల ఇదంతా చేయాల్సి వచి్చంది. 
టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో సమ్మె చేసిన ఆర్టీసీ యూనియన్లు... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనూ సమ్మెకు దిగాయి. పకడ్బందీ నిర్ణయాలు తీసుకునే స్వేచ్చ యాజమాన్యాలకు ఈ యూనియన్లు ఇవ్వవు.
సమ్మె ఉధృతం చేస్తామనడం హాస్యాస్పదం. ప్రభుత్వం దృష్టిలో, ఆర్టీసీ యాజమాన్యం దృష్టిలో ఆర్టీసీ సిబ్బంది 1,200 మాత్రమే. 


మిగతా వారిని ఎవరూ డిస్మిస్‌ చేయలేదనీ....  వాళ్లంతట వాళ్లే తొలగిపోయారన్నారు.  గడువులోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసినప్పటికీ గడువులోగా వారు చేరకపోవడంతో వాళ్లు ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’అయినట్లే.  విధుల్లో ఉన్న 1,200 మంది తప్ప ,తొలగిపోయిన వారు డిపోల దగ్గర లేదా బస్‌ స్టేషన్ల దగ్గర గొడవ చేయకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు.రాష్ట్రంలో ప్రస్తుతం విద్యార్థులు, దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు, పోలీసు అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు, ఉద్యోగులు తదితరుల రాయితీ బస్సు పాసులు ఇక ముందు కూడా కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ఇవన్నీ ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని, సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. అందుకు కావాల్సిన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.  ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌. నర్సింగ్‌రావు, రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌ సుల్తానియా, అడిషనల్‌ డీజీపీ జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: