సమైక్యాంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణా రాష్ట్రం విడిపోయి నవ్యంధ్ర ప్రదేశ్ ఏర్పడి 5 ఏళ్ళ పైనే అయినప్పటికీ ఇప్పటికి వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం మాత్రం జరపలేదు. తమకు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందని... జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించలేదు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగడానికి బదులుగా జూన్ 2 నుంచి వారం పాటు నవనిర్మాణ దీక్షలు చేస్తూ వచ్చారు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం తో రాష్ట్ర అవతరణ దినోత్సవం అధికారికంగా  జరుపెందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని  వార్తలు వస్తున్నాయి. అయితే పాదయాత్రలో కూడా జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రావతరణ దినోత్సవాన్ని అధికారికంగా చేపడుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 

 

 

 

 

 ఇటీవలే  రాష్ట్ర అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించడంపై నిర్ణయం తీసుకువాల్సిందిగా  ఏపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖ కూడా రాశారు . ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనెల 16న జరగబోయే క్యాబినెట్ మీటింగ్ లో ఈ విషయం పై చర్చించి జగన్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం పై ఓ నిర్ణయం తీసుకోనుంది . 

 

 

 

 

 కాగా  నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై క్యాబినెట్ మొత్తం ఆమోదం తెలిపితే...రాబోయే నవంబర్ 1 నెలలో రాష్ట్ర అవతరణ దినోత్సవం  అధికారికంగా నిర్వహించేందుకు ఆస్కారం ఉంది . అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించే అంశంపై ఇప్పుడే స్పందిస్తారా లేకపోతే ఈ అంశాన్ని పెండింగ్ లో పెడతారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: