ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఒకరి పై ఒకరు ఆరోపణలు, విమర్శించుకోవడం దాటి..... దాడులు దాడులకు పాల్పడటమే కాదు ఒకరిపై ఒకరు పోలీసులకు పిర్యాదులు చేస్తున్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. 


చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇప్పుడు పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి చేరింది.ఇప్పుడుతెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని వైసిపి ఎమ్మెల్యేలు అస్త్రాలుగా వాడుకోబోతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా ఆయనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు.


వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, సుధాకర్ బాబు సోమవారం ఉదయం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఆయనకు ఇచ్చారు. 
అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.



చంద్రబాబుపై సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు అసభ్యకరమైన కామెంట్స్ చేశారంటూ డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుకు.. టీడీపీ నాయకులు చేసిన దూషణలు కనిపించలేదా అంటూ నిలదీశారు. 
40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఇంతలా దిగజారుతారని ఎవరూ అనుకోరని చెప్పారు. తనను పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించిన ఉదంతాన్ని, గణేషుడి మండపంలో టీడీపీ కార్యకర్తలు చేసిన అవమానాన్ని కూడా చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో చూపించి ఉంటే బాగుండేదని శ్రీదేవి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: