మొన్నటి వరకు హైదరాబాద్లో ఎక్కువ శాతం వర్షపాతం నమోదు కావడంతో హైదరాబాద్ నగరం మొత్తం భారీ వర్షాలతో బెంబేలెత్తి పోయింది. నగర రహదారులు జలమయమయ్యాయి.దీంతో  వాహనదారులు ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇళ్లలోకి నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. మొన్నటివరకు కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా హైదరాబాద్ స్తంభించిపోయింది. హైదరాబాద్ నగరం మొత్తం చినుకు పడితే చిత్తడిగా అన్న చందంగా మారిపోయింది. దీంతో హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి అంటే చాలు హైదరాబాద్ నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

 

 

 

 

 

 ఎక్కడ ముప్పు వాటిల్లుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక దీనికి తోడు విషజ్వరాలు ప్రబలతుండడటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ముందే హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఇరుక్కుపోయి ఉండడం దీంతో ఒక్కసారిగా రోడ్లపైకి వరదలు రావడంతో ఆ చెత్త చెదారం మొత్తం ఇళ్ళ లోకి చేరుతుంది. దాంతో ఈగలు దోమలు స్వైరవిహారం చేసి ప్రజలు  విష జ్వరాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు . విష జ్వరాలు  రోజురోజుకూ ఎక్కువ ఉండటంతో హాస్పిటల్లో విష జ్వరాల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 

 

 

 

 

 

 కాగా ఈ రోజు కురిసిన వర్షానికి నగరవాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి భారీ వర్షం రావడంతో ఏం జరుగుతుందోనని నగరవాసులు భయాందోళనకు గురయ్యారు . జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చి కారు మబ్బులు కమ్ముకొని ఏకదాటిగా వర్షం పడడంతో చూస్తుండగానే  నిమిషాల్లో రహదారులన్ని  జలమయమయ్యాయి. వర్షపు నీటితో చెరువులను తలపించాయి నగర రహదారులు. దీంతో పలుచోట్ల తీవ్ర ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: