వైసిపి నేత పీవీపీ, బండ్ల గణేష్ ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నిన్నటికి నిన్న తెలంగాణలో చట్టాన్ని, న్యాయాన్ని డబ్బులు పెట్టి కొనలేమని , ధర్మమే జయిస్తుంది అని ట్వీట్ చేసిన బండ్ల గణేష్ ఈరోజు ట్విట్టర్ వేదికగా పీవీపీపై తిట్ల దండకం మొదలెట్టారు. నేను కష్టాల్లో ఉన్నాను నా ఇమేజ్ పెంచు , నా గురించి కాస్త బాగా మాట్లాడు అని తన కాళ్ళు పట్టుకుని బతిమిలాడితే టెంపర్ చిత్రం ఆడియో ఫంక్షన్ లో ఇస్కాం రాజా పి.వి.పి గురించి మాట్లాడానని ట్వీట్ చేశారు. అలా మాట్లాడేందుకు చింతిస్తున్నానంటూ మరో ట్వీట్ చేసిన బండ్ల గణేష్ తాను పీవీపీలా వెయ్యి వ్యవహారాలు, వెయ్యి స్కాములు చెయ్యనని నిజాయితీగా బ్రతుకుతున్నానని పేర్కొన్నారు. 



అంతే కాదు 30 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లోనే ఉన్నానని, మరో 30 సంవత్సరాలు ఇండస్ట్రీలోనే ఉంటానని ఇక్కడే చచ్చిపోతానని పేర్కొన్నారు. ఇప్పటికైనా నీతిగా నిజాయితీగా బ్రతుకు అని పీవీపీకి హితవు పలికారు.  నా అప్పులు, తప్పులు అన్నీ కలిపి నువ్ ఒక్కరోజు ముంబై లో జల్సా చేసినంత లేదు నా బ్రతుకు అని పేర్కొన్నాడు.  నీ స్కాం లు ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందాయని ఎద్దేవా చేశారు.
 ఎన్నో స్కాములకు మూలమైన నువ్వు ఎందరి జీవితాలను భ్రష్టుపట్టించావో , ఎందర్ని మోసం చేశావో అందరికీ తెలుసన్నారు. ఇక అంతే కాదు పివిపి లాగా రోజుకు ఒక పార్టీ, గంటకు ఒక మనిషి ని మార్చడం తనకు రాదని బండ్ల గణేష్ అన్నారు. ఒకరోజు పొగుడుతావు, ఒక రోజు భుజాన వేసుకెళ్తావు మళ్ళీ రెండో రోజు వాళ్ళ దగ్గరే టికెట్ తెచ్చుకుంటావు. 



జనం చీదరించినా , చీత్కారించినా అక్కడే వేలాడుతూ ఉంటావంటూ విమర్శలు గుప్పించారు. ఇక తాను పీవీపీలా కాదు అని, నమ్మినవారిని చచ్చే దాకా ప్రేమిస్తానని అది తన బ్లడ్ లో ఉందని...... నీ బ్లడ్ లో అలాంటి లక్షణాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. దేవుడు నీకు రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించి తప్పు చేశాడని మరో ట్వీట్ లో పేర్కొన్నాడు. నీ స్కాములతో దయచేసి పార్టీలను, ప్రజలను భ్రష్టు పట్టించి ఆయనకు చెడ్డపేరు తీసుకురాకు. దయచేసి రాజకీయాలు మానుకో.. స్కాముల నుండి తప్పించుకోవడానికి లండన్ లో ఒక ఇల్లు, గోవా లో ఒక ఇల్లు కట్టుకున్నావ్. నీ గురించి అంతా తెలుసు అంటూ మండిపడ్డారు బండ్ల.


 ఇక అంతే కాదు మరో ట్వీట్లో నా గురించి నా క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ పెద్ద అయిన 50 సంవత్సరాల నుండి ఫైనాన్షియర్ గా ఉన్న సత్తి రంగయ్య గారిని అడుగు.. ఆయన నేనేంటో చెప్తారు.
  క్యారెక్టర్ లేనోడివి.....  నువ్వేంటి స్కాం రాజా నా క్యారెక్టర్ గురించి చెప్పేది అంటూ ఈరోజు ఉదయం నుండి పి వి పి టార్గెట్ గా వరుస ట్వీట్లు పెడుతూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 
ఇక ఆ ట్వీట్ లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని , ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ పోస్టులు పట్టడం మరో విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: