2014 వరుకు వైసీపీలో కీలక పాత్ర పోషించిన జూపూడి ప్రభాకర్ రావు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో వైసీపీ పార్టీ మీద, ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ నోటితో అయితే వైసీపీ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారో అదే జూపూడి ఇప్పుడు వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు, అతను ప్రజలకు చేసే మంచి నచ్చి మళ్ళి తిరిగి పార్టీకి చేరారు.     


మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని అందుకే పార్టీలో చేరుతున్న అని జూపూడి ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు.        


వైసీపీలో చేరిన అనంతరం జూపూడి మాట్లాడుతూ .. 10 సంవత్సరాలుగా వైఎస్ జగన్ ప్రజాసమస్యలపై పోరాటం చేసిన తర్వాత ఆంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారని, జగన్ ఆలోచన, ప్రభుత్వం పనితీరు ఎంతగానో అతనికి నచ్చిందని అందుకే వైసీపీలో చేరమని జూపూడి పేర్కొన్నారు. నిన్నటి వరుకు టీడీపీ లో జూపూడి ఈరోజు ఉదయమే వైసీపీలో చేరారు.          


సరైన ఆలోచన లేక గొర్రెల్ల పక్కదారి పట్టడని, అందరిలా అలోచించి అతను కూడా టీడీపీ చేరానని జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. కాగా సీఎం జగన్ పాలనను ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని అయన చెప్పారు. పదవులు ఆశించి పార్టీలోకి చేరలేదని వైసీపీ పార్టీలో సైనికుడిలా పని చేయటానికి పార్టీలో చేరానని జూపూడి వ్యాఖ్యానించారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: