అమెజాన్ ఇండియా మొదటి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మూడు రోజుల క్రితమే ముగిసింది. ఇంతలోనే మరోసారి అమెజాన్ కంపెనీ తదుపరి సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ అక్టోబర్ 13 న ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం స్పెషల్ గా ఈ సేల్ అక్టోబర్ 12 మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమవుతుంది. 

                  

అయితే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ తో భాగస్వామ్యం అయ్యింది, దీని కింద వినియోగదారులకు ఐసిఐసిఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చేసిన కొనుగోళ్లకు 10% తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. ఈ సేల్ సమయంలో, మీరు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, కెమెరాలు, టీవీలు మరియు ఇతర గాడ్జెట్లలో గొప్ప డీల్స్ ,ఆఫర్లను పొందుతారు.

                     

కాగా ఈ సేల్ సమయంలో, స్మార్ట్ ఫోన్లకు 40% వరకు తగ్గింపు లభిస్తుంది మరియు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ , ఎక్స్ చేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ మొదలైన ప్రయోజనాలు కూడా వస్తాయి. అలాగే, యాపిల్, షావోమి, వన్ ప్లస్, శామ్సంగ్, వివో, హానర్ వంటి బ్రాండ్ల ఫోన్లలో మంచి డీల్స్ ఉంటాయి. అమెజాన్ వెబ్సైట్ యొక్క టీజర్ పేజీ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేషన్ స్పెషల్ సేల్లో అమెజాన్ స్పెషల్ లాంచ్ కూడా ఉంటుంది. రాబోయే వన్ ప్లస్ 7 T ప్రో ను కూడా ఈ సెల్ లో  తీసుకురావచ్చు. కాగా ఇంటికి కావాల్సిన వస్తువులలో కూడా చాలా వరుకు ఆఫర్స్ ఉంటాయి. 

                      

మరింత సమాచారం తెలుసుకోండి: