కాకాణి గోవర్ధన్ రెడ్డి. వైసీపీ పార్టీలో ఒక  కీలక నాయకుడు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తన వాదనలు  బలంగా వినిపించారు. ప్రభుత్వం తరఫున పదునైన విమర్శలు సంధించి ప్రతిపక్షంతో ఓ ఆట ఆడుకున్నారు ఈ నేత. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుస విజయాలు సాధించిన కాకాణి.. నియోజకవర్గం సహా జిల్లాపై  కూడా బాగా పట్టు సాధించారు. 


వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన వివాదాలకు చాల దూరంగానే ఉంటారు. గతంలో వైఎస్ ఉన్నప్పుడు జడ్పీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన జగన్ బాట బట్టి వైసీపీలో చేరి సర్వేపల్లిలో పోటీ చేసి రెండు సార్లు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై విజయం సాధించారు.


ఈ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయం సాధించడంతో వైసీపీ ప్రభుత్వంలో మంత్రి వర్గంలో చోటు లభించాలని భావించిన కాకాణికి కానీ ఎదురు దెబ్బతగిలింది. దీంతో ఆయనకు మంత్రి కావాలన్న కోరిక నెరవేరలేదు. తనకన్నా ముందునుంచే పార్టీలో అభ్యర్థులు ఉన్నందుకు తనకు మంత్రి వర్గంలో సీటు వస్తుందో లేదోనని భావిస్తున్నారు కాకాణి.. ఆ సీనియర్లకు పొగపెట్టడం ప్రారంభించారు. 


ఈ క్రమంలోనే ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  ఎంపీడీవో ఫిర్యాదు వెనుక కాకాణి ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది.  జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో ఆయన మాటకు తిరుగులేదని అనుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అయితే ఇప్పుడు సీనియర్ నాయకులను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక రాని మంత్రి పదవి కోసం.. వచ్చే అవకాశం కూడా వదులుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక పెద్ద  ట్విస్ట్ ఉంది.. కాకాణి.. మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డితో చెలిమి చేస్తున్నారు. అయితే ఈయన కూడా మంత్రి పదవి కోసం ఆశించి భంగ పడిన నాయకుడే కావడం పెద్ద  గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: